తప్పు చేసిన వారిని దేవుడు శిక్షిస్తాడు: దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ డిప్యూటీ సీఎం

By Nagaraju penumalaFirst Published Dec 7, 2019, 4:46 PM IST
Highlights

రాబోయే ఒలింపిక్ క్రీడోత్సవాల్లో కరాటేకు కూడా స్థానం కల్పించారని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. విజయవాడలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో డా.వైయస్సార్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను సినీనటుడు సుమన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. 

అమరావతి: ఆడపిల్లలు తమను తాము రక్షించుకోవాలంటే అందుకు అవసరమైన కరాటే శిక్షణ తీసుకోవాలని సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. ఆడపిల్లల ఆత్మరక్షణ కోసం కరాటే విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం అంతర్జాతీయస్థాయిలోనూ కరాటే విద్యకు మంచి గుర్తింపు ఉందన్నారు. రాబోయే ఒలింపిక్ క్రీడోత్సవాల్లో కరాటేకు కూడా స్థానం కల్పించారని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. 
విజయవాడలోని మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో డా.వైయస్సార్ మెమోరియల్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలను సినీనటుడు సుమన్ తో కలిసి ఆమె ప్రారంభించారు. 

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో దిశ సంఘటన జరిగిన తర్వాత ఆడపిల్లలంతా భయపడే పరిస్థితులు వచ్చాయన్నారు. అయితే తప్పు చేసిన వారిని దేవుడు తప్పక శిక్షిస్తాడనడానికి దిశ సంఘటన నిదర్శనంగా నిలిచిందన్నారు.

Justice For Disha:ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ వివరణ ఇదీ.....  

దిశపై అత్యంత పాశవికంగా రేప్ చేసి, హతమార్చిన నలుగురు నిందతులు పోలీస్ ఎన్ కౌంటర్ లో హతమవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమాజాన్ని రక్షించే యంత్రాంగం ఉన్నప్పటికీ ఆడపిల్లలకు తమను తాము రక్షించుకొనే శక్తి కావాల్సిందేనన్నారు. 

ఎలాంటి ఆయుధం లేకపోయినా ఆత్మరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడే కరాటే లాంటి శిక్షణలు తీసుకోవాలని పుష్పశ్రీవాణి సూచించారు. ప్రస్తుతం కరాటేకు స్వర్ణయుగం ప్రారంభమైయిందని తెలిపారు. 

గతంలో ఎంత ప్రయత్నించినా ఒలంపిక్ క్రీడల్లో స్థానం దొరకని కరాటేకు 2020లో నిర్వహించే ఒలంపిక్ క్రీడల్లో స్థానం లభించడమే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రానికి, దేశానికి మంచి క్రీడాకారులను అందించే దిశగా కరాటేలో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయాలని ఆమె ఆకాంక్షించారు. 

మహిళలు స్వయం ఆత్మరక్షణ చేసుకోవడానికి దోహదపడేలా కరాటే శిక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. దివంగత సీఎం వైయస్సార్ పేరుతో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా హాజరుకావడం సంతోషంగా ఉంటుందన్నారు. 

వైయస్సార్ పేరే తామందరికీ స్ఫూర్తిదాయకమని పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. అలాగే కరాటే క్రీడకు కూడా సినీనటుడు సుమన్ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. కరాటే అంటేనే ముందుగా గుర్తొచ్చేది సుమన్ పేరేనని అన్నారు. 

ధైర్యం ఎక్కడో లేదు మా అరుపులోనే ఉందన్న విధంగా కరాటే విద్యార్థులు చేసిన విన్యాసాలను చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. దిశ సంఘటన తెలంగాణలో జరిగినా దేశమంతా దీనిపై స్పందించిందని చెప్పారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్: వైఎస్ఆర్ గుర్తొచ్చారన్న వాసిరెడ్డి పద్మ

ఆత్మరక్షణ చేసుకొనే విద్యలు అమ్మాయిలకు అత్యవసరం అని అభిప్రాయపడ్డారు. అమ్మాయిల్లో ప్రస్తుతం మార్పు వస్తోందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలమనే ధైర్యం తెగువ కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఆయుధాలు లేకపోయినా స్వీయ రక్షణ చేసుకోగలిగే శిక్షణ అమ్మాయిలకు అవసరమని, దీన్ని పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలని సూచించారు. 

ఆత్మరక్షణను ఒక పాఠ్యాంశంగా చేర్చి, వారంలో ఒకటి లేదా రెండు సార్లు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ శిక్షణ వల్ల శారీరిక ధృఢత్వంతో పాటుగా మానసిక ధైర్యం, వ్యక్తిత్వ వికాసం కూడా కలుగుతుందని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభిప్రాయపడ్డారు.  

జగన్ తో ఆ విషయం చెప్పాలనుకున్నా, కానీ అపాయింట్మెంట్ దొరకలేదు: హీరో సుమన్

click me!