మరణించిన కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం: కడపలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ టూర్

By narsimha lodeFirst Published Dec 2, 2021, 3:25 PM IST
Highlights

భారీ వర్షాల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో  నష్టం చోటు చేసుకొంది. కడప జిల్లాలో  సీఎం జగన్  పర్యటించారు. పునరావాస కేంద్రంలో బాధితులతో జగన్ మాట్లాడారు.

కడప:వరదలతో మరణించిన కుటుంబం నుండి ఒక్కరికి  ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. Kadapa జిల్లాలోని Flood ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. రాజంపేట నియోజకవర్గంలోని మందపల్లి, పులపుత్తూరులో సీఎం జగన్‌ పర్యటించారు. గత మాసంలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో Heavy Rains కురిశాయి. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. వారిని ఓదార్చారు. బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. బాధితులనుద్దేశించి Ys Jagan  ప్రసంగించారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ చెప్పారు. పొలాల్లో ఇసుకను ఎడ్లబండ్లతో స్థానికులు తోలుకోవచ్చని సీఎం జగన్ చెప్పారు. వరదలో ఇళ్లు కోల్పోయిన వారికి  మూడు లేదా ఐదు సెంట్లలో ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇస్తోందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు వేగంగా సహాయం అందించిన  చరిత్ర గతంలో ఏనాడూ లేదన్నారు.  13 రోజుల తర్వాత తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు ప్రభుత్వం అందించిన సహాయం అందుతున్న వివరాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్పారు. 

also read:వరద బాధిత ప్రాంతాల్లో జగన్ టూర్: రెండు రోజులు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన

రానున్న రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఉత్తరాంధ్రతో పాటు ఉఁభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్షించారు. కడప జిల్లాలోని పులపత్తూరులోని వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. కాలి నడకన  వరద బాధితులను  కలుసుకొన్నారు. వారి సాధక బాధకాలను  అడిగి తెలుసుకొన్నారు. వరదలో తాము సర్వస్వం కోల్పోయామని  బాధితులు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఓ బాధితురాలు  మాత్రం  తన ఇల్లుతో పాటు అన్ని కోల్పోయామన్నారు. అయితే ఇంటి గురించి తనకు వదిలేయాలని సీఎం జగన్ చెప్పారు.  వరద ప్రభావం గురించి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కూడా సీఎం జగన్ పరిశీలించారు. జిల్లాల్లోని ఏ ఏ ప్రాంతంలో వరద పరిస్థితి ఎలా ఉందనే విషయమై అధికారులు సీఎం జగన్ కు వివరించారు.పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సౌకర్యాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు.  ఇవాళ కడప, చిత్తూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. రేపు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఆయన పర్యటిస్తారు.

నవంబర్ మాసంలో  రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో  భారీ నష్టం చోటు చేసుకొందని సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. తక్షణ సహాయంగా రూ. 1000 కోట్లు ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.ఇటీవలనే రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటించింది.  రాష్ట్రంలో వరద పరిస్థితిపై చర్చించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అందించిన సేవలపై కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. 

click me!