పులివెందులలో మహిళ దారుణ హత్య : నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా.. ప్రేమికుడి దారుణం...

Published : Dec 02, 2021, 02:46 PM IST
పులివెందులలో మహిళ దారుణ హత్య : నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా.. ప్రేమికుడి దారుణం...

సారాంశం

పులి వెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్రికల్ షాపుపై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. రిజ్వానా పెళ్లి కాకముందే మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్ కు ఆమెకు ఇచ్చి వివాహం చేశారు. 

పులివెందుల : పులి వెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులో బుధవారం ఉదయం రిజ్వానా (28) అనే వివాహిత Brutal murderకు గురైంది. ప్రియుడే ఆ woman పాలిట కాలయముడయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమయ్యింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

పులి వెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్రికల్ షాపుపై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. Rizwana పెళ్లి కాకముందే మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్ కు ఆమెకు ఇచ్చి వివాహం చేశారు. 

వీరి జీవితం సజావుగా సాగింది. 3 నెలల కిందట రిజ్వానా కుమారుడితో కలిసి ప్రియుడు హర్షవర్థన్ తో వెళ్లిపోయింది. దీని మీద అప్పట్లో భర్త సర్దార్ భార్య కనిపించలేదని ఫిర్యాదు చేశాడు. అనంతపురం జిల్లా కదిరి పోలీసులు రెండు రోజుల తర్వాత హర్షవర్ధన్, రిజ్వానాలను కనిపెట్టి పోలీస్ స్టేషన్ కు పలిపించారు.

అప్పట్లో పోలీస్ స్టేషన్ లో పెద్ద మనుషులు సమక్షంలో రిజ్వానా తనకు భర్త కావాలని చెప్పింది. దీంతో భార్యభర్తలు పట్టణంలో రమణారెడ్డి Electrical shop పైఅంతస్తులో నివసిస్తున్నారు. వారం రోజుల క్రితం హర్షవర్థన్ రిజ్వానాకు ఫోన్ చేసి తన వద్ద ఉండకుండా భర్త వద్ద ఉంటావా.. నిన్ను చంపేస్తానంటూ బెదిరిస్తుండేవాడు.

ఈ క్రమంలో బుధవారం సర్దార్ వెల్డింగ్ వర్క్ కు వెళ్లాడు. రిజ్వానా తల్లితో కలిసి రమణారెడ్డి ఎలక్ట్రికల్ షాపులో ఉండగా హర్షవర్దన్ కత్తితో పొడిచాడు. దీంతో రిజ్వానా అక్కడి కక్కడే మృతి చెందింది. హర్షవర్ధన్ పారిపోతుండగా రమణారెడ్డి షెట్టర్ వేసి అతన్ని షాపులో ఉంచి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ భాస్కర్ రెడ్డి, ఏఎస్ఐ చంద్రశేఖర్ నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రమణారెడ్డిని వివరాలు అడిగి తెలసుకున్నారు. మృతురాలికి భర్త సర్దార్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. సర్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వరద బాధిత ప్రాంతాల్లో జగన్ టూర్: రెండు రోజులు మూడు జిల్లాల్లో సీఎం పర్యటన

ఇదిలా ఉండగా, మహబూబ్ నగర్ లో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి married woman బలవన్మరణం పాల్పడింది. ఈ ఘటన Mahabubnagar జిల్లా మిడ్జిల్ మండలం కేంద్రంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత (20)కి మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ళ కిందట వివాహమయ్యింది.

వీరికి 9 నెలల చిన్నారి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత మనస్థాపానికి గురై చిన్నారితో కలిసి రెండు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లి, బిడ్డ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. missing కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివారులోని నీటి కుంటలో తల్లి, కుమార్తె dead bodyలను స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు.  చిన్నారిని సరిత తన నడుముకు కట్టుకుని suicideకు పాల్పడింది. 

ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి... పోస్టుమార్టం నిమిత్తం జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ ఐ  జయ ప్రసాద్ తెలిపారు.  కాగా కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకే  సరిత  బలవన్మరణానికి పాల్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Nimmala Ramanaidu: ఈ రిజర్వాయర్ల భూ సేకరణలో జగన్ రైతులకు ఏం చేశారో తెలుసా? | Asianet News Telugu
టీడీపీ బతుకంతా కాపీ పేస్టే.. Gudivada Amarnath Comments on Bhogapuram Airport | Asianet News Telugu