వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే 3 రాజధానుల బిల్లు.... టీడీపీకి నందమూరి ఫ్యామిలీయే దిక్కు: మంత్రి బాలినేని

By Siva KodatiFirst Published Dec 2, 2021, 3:14 PM IST
Highlights

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో (ap budget session 2022) 3 రాజధానుల సవరణ బిల్లు (three capital bill) ప్రవేశపెడతామని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) . చంద్రబాబు (chandrababu naidu) చేసేవన్నీ డ్రామాలేనని.. లోకేశ్ (lokesh) ఒక పనికిరాని పప్పు అని మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. 

వచ్చే బడ్జెట్ సమావేశాల్లో (ap budget session 2022) 3 రాజధానుల సవరణ బిల్లు (three capital bill) ప్రవేశపెడతామని అన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) . చంద్రబాబు (chandrababu naidu) చేసేవన్నీ డ్రామాలేనని.. లోకేశ్ (lokesh) ఒక పనికిరాని పప్పు అని మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ బ్రతికి బట్ట కట్టాలంటే ఎన్టీఆర్ కుటుంబసభ్యులు రావాల్సిందేనని బాలినేని అన్నారు. టీడీపీ (tdp) హయాంలో విద్యుత్ శాఖలో రూ.70 వేల కోట్ల అప్పు ప్రజలపై మోపారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని త్వరలోనే గాడిలో పెడతామని బాలినేని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ పీఆర్సీనీ (prc) అమలు త్వరలోనే చేపడతామని మంత్రి పేర్కొన్నారు. 

మరోవైపు మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఏపీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల చట్టాన్ని ఈ నెల 22న ఉపసంహరించుకొన్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఈ బిల్లును ఆమోదించిన విషయాన్ని కూడా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మ AP High court అఫిడవిట్ ఇచ్చారు. Three capitals చట్టం ఉపసంహరణ గురించి కూడా వివరించారు. ఈ నెల 23న AP legislative Council లో కూడా  ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయాన్ని  కూడా అఫిడవిట్ లో ప్రభుత్వం వివరించింది.వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించినందున తగు ఉత్తర్వులు ఇవ్వాలని ఆ ఆఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం కోరింది.

Also Read:మూడు రాజధానుల చట్టం రద్దు: ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ అఫిడవిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్  ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు.

అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు.  45 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సాగుతుంది. నిన్న బీజేపీకి చెందిన నెల్లూరు జిల్లాలో ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లాలో బీజేపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావం తెలిపిన మరునాడేఏపీ సర్కార్ ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ నెల 22న నిర్వహించిన కేబినెట్ అత్యవసర సమావేశంలో ఏపీ  ప్రభుత్వం మూడు రాజధానులపై చేసిన చట్టాలను వెనక్కి తీసుకొంది. 

click me!