ఇంగ్లీష్ మీడియంపై వ్యాఖ్యలు: రఘురామకృష్ణంరాజుపై జగన్ సీరియస్

By Siva Kodati  |  First Published Nov 19, 2019, 9:12 PM IST

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరిపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వైఖరిపై వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో రఘురామకృష్ణంరాజు వ్యవహరించిన తీరుపై జిల్లా ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డితో జగన్ చర్చించారు.

ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడటం పట్ల సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడిన కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు హెచ్చరికలు పంపారు. పేద పిల్లల అభ్యున్నతి, భవిష్యత్తు కోసం పెడుతున్న ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పేదల శ్రేయస్సును అడ్డుకున్నట్లేనని జగన్ వ్యాఖ్యానించారు.

Latest Videos

undefined

లోక్‌సభ సమావేశాల సందర్భంగా మాట్లాడిన రఘురామకృష్ణంరాజు.. షెడ్యూల్ 10లో ఉన్న తెలుగు అకాడమీని విభజించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే తెలుగుభాష అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

Also Read:pawan kalyan:తల్లిని చంపొద్దు: జగన్ పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లు గడుస్తున్నా తెలుగు అకాడమీని అలాగే ఉంచారని.... ఇప్పటి వరకు ఏపీలో అకాడమీ ఏర్పాటుకు చరయ్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు. 

ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. మా తెలుగుతల్లిని కాపాడాల్సిన మీరే తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు అంటూ జగన్ పై మండిపడ్డారు. 

తెలుగు భాషా సరస్వతిని అవమానించకండి అంటూ హితవు పలికారు. ఇంగ్లీష్ భాషను వద్దని ఎవరూ చెప్పడం లేదని తెలుగు మాతృ భాష పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వైసీపీ నాయకుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి స్పష్టం చేయాలని తెలిపారు. 

మాతృభాషని,  మాండలికాలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు పేపర్ నడుపుతూ, తెలుగుని చంపేసే ఆలోచన భస్మాస్ముర తత్వాన్ని సూచిస్తుందని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. 

ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెడుతూ కేబినెట్ తీర్మాణం చేసింది. అందుకు సంబంధించి ఒక ఐఏఎస్ అధికారిని సైతం నియమించింది. 

Also Read:నేనే కాదు, మురళీమోహన్ కూడా: అయ్యప్ప మాలలో చెప్పులు వేసుకోవడంపై మంత్రి అవంతి

అలాగే ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూనే తెలుగు సబ్జెక్టు కంపల్సరీ అంటూ సీఎం వైయస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆనాటి నుంచి ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగుభాషను చంపేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగంతి తెలిసిందే. 

click me!