ఆరెస్సెస్, బీజేపీలను వైసీపీకి దూరంగా చేసే కుట్ర జరుగుతోందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. బీజేపీ-వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు
ఆరెస్సెస్, బీజేపీలను వైసీపీకి దూరంగా చేసే కుట్ర జరుగుతోందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. బీజేపీ-వైసీపీ మధ్య చెడితే తాను దూరాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్నటి వరకు మోడీని విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మోడీని పొగిడే స్థితికి వచ్చారని అవంతి ఎద్దేవా చేశారు.
డయాబెటిస్ ఉండగా.. మాలలో ఉండగా చెప్పులు వేసుకోవడం తప్పు కాదని ఆయన గుర్తు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు మాల వేసుకున్న సందర్భంలో చెప్పులు వేసుకున్నా.. అప్పుడు కన్పించ లేదా.. అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. మాజీ ఎంపీ మురళీ మోహన్ కూడా మాల వేసుకుని చెప్పులు వేసుకుంటారని మంత్రి గుర్తుచేశారు.
తాను హిందువుగానే పుట్టానని.. హిందువుగానే చనిపోతానని శ్రీనివాస్ స్పష్టం చేశారు. పూజ నిర్వహించనిదే తాను భోజనం చేయనని.. కుట్రలో భాగంగా కావాలనే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు.
Also Read:నేనే కాదు, మురళీమోహన్ కూడా: అయ్యప్ప మాలలో చెప్పులు వేసుకోవడంపై మంత్రి అవంతి
చింతమనేని జైల్లో ఉన్నారు కాబట్టి సింపతీ వచ్చి ఉంటుందని చంద్రబాబు వెళ్లి పరామర్శించారని అవంతి ఎద్దేవా చేశారు. చింతమనేని ఈ విధంగా కావడానికి కారణం చంద్రబాబేనని శ్రీనివాస్ ఆరోపించారు. పదవులిచ్చే సమయంలో గుర్తుకు రాని వర్ల, పంచుమర్తి వంటి నేతలు రాజకీయాల కోసం గుర్తొస్తారని ఆయన చురకలంటించారు.
అయ్యప్ప దీక్షలో ఉన్న మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పులు వేసుకోవడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. అయ్యప్పమాలలో ఉంటూ చెప్పులు వేసుకోవడం హైందవ ధర్మానికి విరుద్ధమంటూ కొందరు అధ్యాత్మికవేత్తలు సైతం తప్పుబడుతున్నారు.
అయ్యప్పమాల వేసుకుని చెప్పులుతో నడుస్తున్నారంటూ తనపై వస్తున్న విమర్శలపట్ల స్పందించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అనారోగ్య కారణాల వల్లే తాను చెప్పులు వేసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.
ఇకపోతే అయ్యప్పమాలలో ఉంటూ ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్ లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ ను బండబూతులు తిట్టిన సంగతి తెలిసిందే.
Also read:చంద్రబాబుకు గట్టి దెబ్బే: వైసీపీ గూటికి కేఈ సోదరులు..? మంత్రి రాయబారం
ఈ సందర్భంలోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్పమాలలో ఉంటూ బూతులు తిడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో మంత్రి అవంతి శ్రీనివాస్ పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలో ఉంటూ చెప్పులు వేసుకుంటారా అంటూ నిలదీశారు.
అటు మాజీమంత్రి దేవినేని ఉహా మహేశ్వరరరావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీ తిట్ల పురాణం, అవంతి శ్రీనివాస్ చెప్పులు వేసుకోవడం ఇదంతా హిందుత్వంపై దాడేనంటూ దేవినేని ఉమా అభిప్రాయపడ్డారు.