ఎప్పుడైనా నెల రోజులు ఏపీలో ఉన్నాడా, ఇప్పుడేమో రాజమండ్రిలో: చంద్రబాబుపై జగన్ సెటైర్లు


చంద్రబాబుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు.  రాష్ట్ర ప్రజలపై బాబుకు  ప్రేమ లేదన్నారు.  సుదీర్ఘకాలం పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు  పేదలకు ఇళ్లు ఎందుకు నిర్మించలేదని ఆయన ప్రశ్నించారు.

AP CM YS Jagan Satirical Comments On Chandrababu naidu lns

 కాకినాడ: చంద్రబాబు ముఖం చూస్తే  స్కాంలు, అవినీతి,  జన్మభూమి కమిటీలు గుర్తుకు వస్తాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో  వైఎస్ఆర్ జగనన్న కాలనీలో  లబ్దిదారులకు సీఎం జగన్ గురువారం నాడు ఇళ్లను అందించారు.లబ్దిదారులతో కలిసి సామూహిక గృహా ప్రవేశాలను చేయించారు జగన్. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ ప్రసంగించారు. 

తన ముఖం చూస్తే పేద ప్రజలకు అమలు చేసే స్కీంలు గుర్తుకు వస్తాయని సీఎం జగన్ చెప్పారు.చంద్రబాబు పేరు చెబితే గజదొంగల ముఠా, పెత్తందారి అహంకారం గుర్తొస్తుందన్నారు. 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు  పేదలకు ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన  ప్రశ్నించారు.  
ఈ 52 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు  ఒక నెల పాటు కంటిన్యూగా  రాష్ట్రంలో కన్పించాడా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రాజమండ్రిలో కన్పిస్తున్నాడని  సెటైర్లు వేశారు.  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నాడు. ఈ విషయమై జగన్  బాబుపై పరోక్ష విమర్శలు చేశారు.చంద్రబాబుకు,దత్తపుత్రుడికి, చంద్రబాబు తనయుడికి, చంద్రబాబు బావమరిదికి ఏపీలో ఇళ్లు లేదన్నారు.  

Latest Videos

ఆంధ్రరాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి  హైద్రాబాద్ లో పంచుకోవడమే  చంద్రబాబుకు,చంద్రబాబును సమర్ధించే వాళ్లకు ఏపీలో ఇళ్లు లేవన్నారు. చంద్రబాబు ఇళ్లు పక్క రాష్ట్రంలోని హైద్రాబాద్ లో కన్పిస్తుందన్నారు.  రాష్ట్ర ప్రజల పట్ల బాబుకు ఉన్న అనుబంధం ఇదే అని  జగన్ చెప్పారు.  తాను ప్రాతినిథ్యం వహిస్తున్న   కుప్పంలో కూడ  పేదలకు ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చంద్రబాబు చేయలేదని ఆయన విమర్శించారు. కానీ  తమ ప్రభుత్వ హయంలోనే కుప్పంలో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు చేసినట్టుగా జగన్ గుర్తు చేశారు.

also read:లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై జగన్ సెటైర్లు

పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్తారని చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.ప్రభుత్వం ఎంత మంచి చేసినా మంటలు పెట్టి కుట్రలు చేస్తున్నారన్నారు.నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు కూడ అనలేరని బాబు తీరుపై విమర్శలు చేశారు.కష్టమొచ్చినా, నష్టమొచ్చినా నిలబడే వాడే నాయకుడన్నారు.రాష్ట్రంలోని 87 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని జగన్ చెప్పారు. 

vuukle one pixel image
click me!