కేసీఆర్ తోనే జగన్ కలిసాడు... మరి చంద్రబాబు, పవన్ కలిస్తే తప్పేంటి?: బుద్దా వెంకన్న

By Arun Kumar PFirst Published Oct 12, 2023, 1:33 PM IST
Highlights

టిడిపి, జనసేన పొత్తుపై విమర్శలు చేస్తున్న వైసిపి నాయకులకు టిడిపి నేత బుద్దా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

విజయవాడ : టిడిపి, జనసేన పొత్తుపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న వైసిపి నాయకులు గత ఎన్నికల్లో ఏం చేసారో గుర్తుచేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇంచార్జీ బుద్దా వెంకన్న సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తో జగన్ కలవలేదా..? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. అయినా సింగిల్ గానే ఎన్నికలకు వెళ్లి గెలుస్తామంటున్న వైసిపి నాయకులు టిడిపి, జనసేన కలిస్తే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వెంకన్న నిలదీసారు. 

కుటుంబ విలువల గురించి ఎన్టీఆర్ బిడ్డలకు బాగా తెలుసు... అందువల్లే లోకేష్ ను పురంధేశ్వరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లిందని వెంకన్న అన్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆ తర్వాత విచారణ పేరిట లోకేష్ ను ఇబ్బందిపెట్టడం పురంధేశ్వరి గమనిస్తూ వున్నారన్నారు. అలాగే తన సోదరి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కూడా ఇబ్బందులు పెట్టడం చూసి సహించలేకే అమిత్ షా వద్దకు లోకేష్ ను దగ్గరుండి తీసుకెళ్లారని  అన్నారు. ఇలా సోదరి కుటుంబం ఇబ్బందుల్లో వుంటే చూడలేక సాయానికి ముందుకు వచ్చిన పురంధేశ్వరికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని వెంకన్న అన్నారు. 

ఇక రాజకీయ కక్షతో సీఎం జగన్ ఎలా ఇబ్బంది పెడుతున్నారో లోకేష్ కేంద్ర హోమంత్రికి తెలిపారని బుద్దా వెల్లడించారు. ఇదే క్రమంలో ఏపీలో జగన్ సర్కార్ కనుసన్నల్లో కొనసాగుతున్న లిక్కర్ స్కాం గురించి అమిత్ షా కు పురంధేశ్వరి వివరించారని తెలిపారు. కేంద్రం ప్రభుత్వం ఏపీలో సాగుతున్న ప్రజాధనం దోపిడీపై దృష్టిసారించాలని కేంద్ర మంత్రిని పురంధేశ్వరి కోరినట్లు వెంకన్న వెల్లడించారు. 

Read More  విశాఖకు జగన్ ఎందుకు వస్తున్నారో అక్కడి ప్రజలకు తెలుసు.. : అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా వున్న సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసని మాట్లాడతున్నాడు... ఏనాడైనా ఆయన చట్టసభలో అడుగుపెడితేనేగా అంటూ బుద్దా వెంకన్న ఎద్దేవా చేసారు. స్కిల్ డెవలప్ మెంట్ ఓ పెద్ద స్కాం అంటూ సజ్జల మాట్లాడుతున్నాడని... అసలు దీని గురించి మాట్లాడే అర్హతే సజ్జలకు లేదన్నారు. సజ్జల పెద్ద అబద్దాల పుట్ట... కుట్రలు పన్ని చంద్రబాబుపై దొంగ అనే ముద్ర వేయాలని చూస్తున్నాడన్నాడని వెంకన్న ఆరోపించారు. 

చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు... అయినా ఆయనను జైల్లో పెట్టి వేదిస్తున్నారని వెంకన్న ఆవేదన వ్యక్తం చేసారు. ఇలా కక్షపూరితంగా గొప్ప నాయకున్ని జైలుకు పంపి జగన్ శునకానందం పొందుతున్నాడంటూ మండిపడ్డాడు.  

సీఎం వైస్ జగన్ వస్తుంటే విశాఖ ప్రజలు గడగడలాడిపోతున్నారని వెంకన్న తెలిపారు. గతంలోనే విజయమ్మను ఓడించి విశాఖ ప్రజలు జగన్ ను వ్యతిరేకించారని అన్నారు. దమ్ముంటే ఓడిన చోట తిరిగి ఎంపీగా గెలివాలని సవాల్ విసిరారు. గత ఎన్నికల్లో మంగళగిరి లో ఓడిన లోకేష్ ఈసారి గెలిచి తీరతాడని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేసారు. 

click me!