సంక్షేమ పథకాల అమల్లో వివక్ష లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. సంక్షేమ పథకాలు దక్కని లబ్దిదారుల ఖాతాల్లో నగదును ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు విడుదల చేశారు.
అమరావతి: సంక్షేమ పథకాల అమల్లో వివక్ష లేదు, లంచాలకు తావు లేదని ఏపీ సీఎం Ys Jagan చెప్పారు. సంతృప్త స్థాయిలో లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Welfare పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన వారికి ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు నగదును జమ చేసింది.18,47,996 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ. 703 కోట్లు జమ చేశారు.
also read:బీజేపీని సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు లీజు: మంత్రి పేర్ని నాని ఫైర్
ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. 15 పథకాల్లో ధరఖాస్తు చేసుకున్న వారికి నగదును జమ చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ఏ ఒక్కరూ మిస్ కావొద్దన్నారు.తమ పార్టీకి ఓటు వేశారా లేదా అనే విషయాన్ని పట్టించుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2.86 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుందని సీఎం తెలిపారు. House sites సహా 16 పథకాలకు అర్హులైన లబ్ది పొందని వారికి నగదును అందచేస్తున్నామని సీఎం వివరించారు.వచ్చే ఏడాది జనవరి 1 నుండి Pensionను రూ.2500 ఇవ్వనున్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లకు అదనంగా 3.44 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నామన్నారు. 3.7 లక్షల మందికి కొత్తగా బియ్యం కార్డులను మంజూరు చేశామని సీఎం జగన్ ప్రకటించారు