ఒక కన్నును మరో కన్ను ఎందుకు పొడుచుకుంటుంది: వైఎస్ వివేకా హత్య కేసుపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు చేసిన విమర్శలకు జగన్ అసెంబ్లీ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
అమరావతి: ఒక కన్నును ఇంకో కన్ను ఎందుకు పొడుచుకుంటుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ చేస్తున్న విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు.AP Assemblyలో శుక్రవారం నాడు సీఎం జగన్ ప్రసంగించారు. టీడీపీ చీఫ్ Chandrababu చేసిన విమర్శలకు Ys Jagan కౌంటర్ ఇచ్చారు. మా చిన్నాన్న మరణం గురించి కూడా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారన్నారు. ఒక వైపు మా నాన్న స్వంత తమ్ముడు, మరో వైపు మా నాన్న తమ్ముడి కొడుకు అని జగన్ సభలో చెప్పారు.
Ys Vivekananda reddy హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే మా చిన్నాన్న హత్య జరిగిందని ఆయన గుర్తు చేశారు. మా చిన్నాన్నను tdp వాళ్లే ఏమైనా చేసి ఉంటారని జగన్ ఆరోపించారు.మా చిన్నాన్నను ఓడించడానికి చంద్రబాబు అనేక కుట్రలు చేశారన్నారన్నారు. మా జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేశారని జగన్ గుర్తు చేశారు.
undefined
also read:Chandrababu Naidu: ప్రెస్‌మీట్‌లో బోరున విలపించిన చంద్రబాబు నాయుడు.. వెక్కి వెక్కి ఏడ్చిన వైనం
మా అమ్మ, చెల్లెలు, బాబాయ్ గురించి చంద్రబాబే మాట్లాడారని సీఎం జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలను వైసీపీ సభ్యులు అనలేదన్నారు. కుటుంబ సభ్యుల పేర్లను వైసీపీ సభ్యులు ప్రస్తావించలేదని జగన్ స్పష్టం చేశారు.చంద్రబాబు ప్రస్టేషన్ లో ఉన్నారనేది రాష్ట్రంలో అందరికీ తెలుసునని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబుపై ప్రజలు బాహటంగానే వ్యతిరేకతను చూపించారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కుప్పంలో కూడా ప్రజలు చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకించారన్నారు.శాసనమండలిలో వైసీపీ బలం పెరగడం కూడా చంద్రబాబుకు రుచించడం లేదన్నారు.
చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదని చంద్రబాబు చెప్పారు. ఏం జరిగిందో అనేది దేవుడు చూస్తున్నాడన్నారు.ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి మీడియా వ్యవస్థలు తనకు లేవన్నారు. తప్పుడు వార్తలు, పదే పదే చెప్పి అదే నిజం అవుతుందని అనుకొంటున్నారన్నారు. చంద్రబాబు కళ్లలో నీళ్లు లేకపోయినా నీళ్లు వచ్చాయని డ్రామా చేశారన్నారు.దేవుడి దయ ప్రజల దీవెన ఉన్నంత కాలం ఎల్లో మీడియా ఏం చేయలేదన్నారు. చంద్రబాబు లేనిపోని విషయాలను మాట్లాడారన్నారు. సభ నుండి వెళ్లిపోతూ శపథాలు చేశారన్నారు.
అయితే దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలున్నంత కాలం ఎవరైనా పదవుల్లో ఉంటారని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు చేసిన విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు లేనిపోని విషయాలను మాట్లాడారన్నారు. సభ నుండి వెళ్లిపోతూ శపథాలు చేశారన్నారు. అయితే దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలున్నంత కాలం ఎవరైనా పదవుల్లో ఉంటారని సీఎం జగన్ చెప్పారు. ప్రతీదాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని చెప్పారు.చంద్రబాబు డ్రామాలను ప్రజలు చూస్తున్నారన్నారు.వంగవీటి రంగ హత్య, మాధవరెడ్డి హత్య, చంద్రబాబు హయాంలోనే జరిగాయి. మల్లెల బాబ్జీ తన సూసైడ్ నోట్‌లో కూడా రాశారని అని సీఎం జగన్ తెలిపారు.