Kadapa Rains: సీఎం సొంత జిల్లాలో వర్షబీభత్సం... వరదల్లో కొట్టుకుపోయిన 30మంది, మూడు మృతదేహాలు లభ్యం

By Arun Kumar PFirst Published Nov 19, 2021, 2:23 PM IST
Highlights

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు సీఎం జగన్ సొంతజిల్లా కడపలో బిభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వర్షాల దాటికి గ్రాామాల్లోకి వరదనీరు చేరి 30మంది గళ్లంతయ్యారు. 

కడప: ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరికి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఇలా కడప జిల్లాలోకురుస్తున్న వర్షాల దాటికి చెయ్యేరు నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నదిలో నీటిృదృతి పెరిగి ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. దీంతో రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయం వద్ద నీటిప్రవాహ దాటికి మట్టికట్ట కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోకి వరదనీరు దాదాపు 30మంది గల్లంతయినట్లు సమాచారం. 

అన్నమయ్య జలాశయానికి గండి పడటంతో వరదనీరు గ్రామాలను ముంచెత్తుతోంది. ఇలా ఇప్పటికే గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి. చెయ్యేరు నది పరవళ్లు తొక్కుతూ రాజంపేట తదితర ప్రాంతాలను ముంచేసింది. ఈ నదీ పరివాహక లోతట్టుప్రాంతాలు నీటమునిగాయి. వివిధ గ్రామాల్లో వరద నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఇలా ఇప్పటివరకు 30మంది చెయ్యేరు నదిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. 

వీడియో

చెయ్యేరు నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తూ గ్రామాలకు గ్రామాలనే ముంచెత్తుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. ముందుగా నదీప్రవాహంలో గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. అలాగే మునకకు గురయిన ప్రాంతాల్లో సహాయం కోసం ఎదురుచూస్తున్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. 

read more Tirupati Rains: చెరువుల ఆక్రమణ వల్లే తిరుపతి మునక...: సీఎం జగన్ తో చిత్తూరు అధికారులు

నందలూరు మండలంలోని గుండ్లూరు, కొలత్తూరుతో పాటు పలు గ్రామాలు నీటిమునగడంతో కొండపైకి ఎక్కిన గ్రామప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు. చుట్టూ నీరు చేరడంతో హెలికాప్టర్ సాయం‌కోసం ఎదురుచూస్తున్నారు. ఎగువన ఫించా డ్యాం నుండి ఉధృతంగా నీరు కిందకు రావడంతో  తెల్లవారుజామున చెయ్యేరు డ్యాంకొట్టుకుపోయింది. నందలూరు లో స్వామి ఆనంద టెంపుల్ కూడా నీటమునిగింది. 

 వరద ఉద్ధృతిలో 30మంది కొట్టుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నా... స్థానికులు మాత్రం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఒక్కసారిగా గ్రామాల్లోకి ప్రవేశించిన వరద నీటిలో చాలామంది కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. చెయ్యేరు నదిలో కొట్టుకుపోయినవారిలో చాలా మంది చనిపోయి వుంటారని... ఏ కొందరో ప్రాణాలతో బయటపడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే నందలూరు వద్ద మూడు మృతదేహాలను అధికారులు వెలికితీసారు. 

ఇక వరద ముంపుతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.

read more  చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలో వర్షబీభత్సం... సహాయక చర్యలకోసం ప్రత్యేక అధికారుల నియామకం

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో వరదనీటి ఉదృతికి రాజంపేట, నందలూరు మధ్యలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో చెన్నై - ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.  చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సామాగ్రి మొత్తం తడిసిపోయాయి. దీంతో ఓవైపు వరదలు, మరోవైపు ఆకలితో చాలామంది తీవ్ర వేదనను అనుభవిస్తున్నారు.  ప్రజలు తిండి, తాగు నీరు లేక అల్లాడుతున్నారు. 

 


 

click me!