జగన్ పై కేసీఆర్ వ్యాఖ్యలు: ఇరిగేషన్ అధికారులతో ఈ నెల 12న ఏపీ సీఎం రివ్యూ

By narsimha lodeFirst Published Aug 11, 2020, 4:25 PM IST
Highlights

 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ఇరగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 


అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ఇరగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడుతో పాటు ఇతర ప్రాజెక్టుల విషయంలో జగన్ వైఖరిపై సీరియస్ గా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.

పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ నెల 10వ తేదీన తెలంగాణ  సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. బేసిన్లు బేషజాలు లేవని ఏపీ సీఎంకు చెబితే లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని ఏపీపై ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాలతోనే ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్టుగా తెలంగాణ స్పష్టం చేసింది. 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోతిరెడ్డిపాడుపై పట్టుదలగా ఉంది.ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు టెండర్లను నిలిపివేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

అపెక్స్ కౌన్సిల్ లో తమ తమ వాదనలను విన్పించాలని రెండు రాష్ట్రాలు కసరత్తు చేసుకొంటున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కూడ నీటిపారుదల ప్రాజెక్టులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం  3 గంటలకు సమీక్ష నిర్వహించనున్నారు.తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్ష చేసిన రెండు రోజులకు ఏపీ సీఎం జగన్ కూడ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నారు. 

ఈ సమీక్షా సమావేశంలో ఏపీ ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేసీఆర్ వ్యాఖ్యలపై కూడ ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం లేకపోలేదు. 

మరోవైపు తమ రాష్ట్రానికి కేటాయించిన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకొంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఆ రాష్ట్రం చెబుతోంది. ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాయి. రెండు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని కూడ రగిల్చింది. 


రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది మే 5వ తేదీన 203 జీవోను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. సుమారు రూ. 7 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:పోతిరెడ్డిపాడుపై మీ వైఖరి చెప్పండి: పర్యావరణ బోర్డుకు లేఖ, తీర్పు రిజర్వ్ చేసిన ఎన్జీటీ

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి టెండర్లను ఆహ్వానిస్తూ జూలై  27వ తేదీన ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. జ్యుడిషియల్‌ పర్వ్యూ అనుమతితో టెండర్లకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈపీసీ విధానంలో 3278.18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 30 నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లను ఆహ్వానించినట్లు అధికారులు వెల్లడించారు.

ఆగష్టు 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెండర్ ధరఖాస్తులను స్వీకరించనున్నారు. 13న టెక్నికల్ బిడ్ తెరిచి, 17న రివర్స్ టెండరింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.19న టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 800 అడుగుల నీటి మట్టం వద్ద రోజుకి 34,722 క్యూసెక్కుల నీరు ఎత్తిపోయడమే లక్ష్యంగా పథకాన్ని రూపకల్పన చేశారు.
 

click me!