విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్, స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.
అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో డాక్టర్ రమేష్ ఆసుపత్రి ఎండీ రమేష్, స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ పరారీలో ఉన్నారు.
ఈ నెల 9వ తేదీన స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కరోనా రోగులు మరణించారు. ఈ ఘటనలో రమేష్ ఆసుపత్రిని ఏ1 గా పోలీసులు చేర్చారు.
సోమవారం నాడు రమేష్ ఆసుపత్రితో పాటు స్వర్ణ ప్యాలెస్ యజమాని శ్రీనివాస్ ఇంట్లో కూడ పోలీసులు సోదాలు నిర్వహించారు.
undefined
కోవిడ్ సెంటర్ లో మెడికల్ ట్రీట్ మెంట్ మాత్రమే తమ ఆసుపత్రిదేనని డాక్టర్ రమేష్ సోమవారం నాడు ప్రకటించారు. కోవిడ్ సెంటర్లో సౌకర్యాలను హోటల్ మేనేజ్ మెంట్ మాత్రమే తీసుకోవాలని డాక్టర్ రమేష్ ప్రకటించారు.
also read:స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాదం: ముగ్గురి అరెస్ట్
అగ్రిమెంట్ కోసం పోలీసులు ఇద్దరిని ప్రశ్నించారు. కానీ అగ్రిమెంట్ మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు.డాక్టర్ రమేష్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమేష్ మంగళవారం ఉదయం నుండి పరారీలో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరోవైపు స్వర్ణ ప్యాలెస్ హోటల్ యజమాని ముత్తవరపు శ్రీనివాస్ కూడ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.పరారీలో ఉన్న డాక్టర్ రమేష్ బాబు, ముత్తవరపు శ్రీనివాస్ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం కేసులు సోమవారం నాడు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంపై నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది జేసీ శివశంకర్ కమిటి.