ఎల్లుండి ప్రజా వేదిక భవనం కూల్చివేత: సీఎం జగన్ ఆదేశం

By narsimha lodeFirst Published Jun 24, 2019, 11:28 AM IST
Highlights

 ప్రజావేదిక భవనం అక్రమంగా నిర్మించినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎల్లుండి ఈ  భవనాన్ని కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు.
 

అమరావతి: ప్రజావేదిక భవనం అక్రమంగా నిర్మించినట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఎల్లుండి ఈ  భవనాన్ని కూల్చివేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం నాడు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ భవన నిర్మాణాన్ని రూ.5 కోట్ల నుండి రూ. 8 కోట్లకు పెంచారని జగన్ ఆరోపించారు. 

నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనంలో  ఇంత మంది అధికారులం సమావేశమైనట్టుగా ఆయన చెప్పారు. ఇలాంటి భవనాన్ని అధికార అండదండలు ఉన్నందున ఎవరూ కూడ ఏమనలేదన్నారు అధికార అండదండలు లేకపోతే పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఓ వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపిందుకే ప్రజా వేదికలో కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో ఇదే చివరి సమావేశమని జగన్ చెప్పారు. 

పర్యావరణ, నదుల చట్టాలతో పాటు అన్ని రకాల నియమ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్టుగా సీఎం జగన్ చెప్పారు.  అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం నుండి ప్రారంభించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

ప్రభుత్వంలో ఉండి  నియమ నిబంధనలకు విరుద్దంగా ఈ భవనాన్ని నిర్మించారని సీఎం జగన్ పరోక్షంగా  చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రభుత్వంలో ఉంటూ ఈ రకమైన భవనాన్ని నిర్మించి ప్రజలకు ఎలా ఆదర్శంగా ఉంటారని ఆయన ప్రశ్నించారు. 

నియమ నిబంధనలను పాటించని వారు ప్రజలు కూడ ఆదర్శంగా ఉండాలని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగేందుకే తాను ఈ సమావేశమందిరంలో మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా  జగన్ చెప్పారు.ప్రతి జిల్లాలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రజా వేదిక భవనం నుండే ప్రారంభం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ భవనాన్ని విపక్ష నేతగా ఉన్న తనను కలిసేందుకు వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజలు, పార్టీ నేతలను కలుసుకొనేందుకు వినియోగించుకొనేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ కు లేఖ రాశారు. 

సంబంధిత వార్తలు

ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు ఓటు చేస్తారు: వైఎస్ జగన్

ఎంతటి వాడైనా అవినీతికి పాల్పడితే సహించం: జగన్ కీలక వ్యాఖ్యలు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి: జగన్

click me!