విధుల్లో చేరేందుకు బయలుదేరి...హోటల్‌లో శవమై తేలిన ఆంధ్రా జవాన్

Siva Kodati |  
Published : Jun 24, 2019, 11:00 AM IST
విధుల్లో చేరేందుకు బయలుదేరి...హోటల్‌లో శవమై తేలిన ఆంధ్రా జవాన్

సారాంశం

ఏపీకి చెందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా సదుం మండలం గంటావారిపల్లెకు చెందిన దివంగత సిద్ధయ్య కుమారుడు గంటా రవికుమార్ పదేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

ప్రస్తుతం చండీగఢ్‌లో పనిచేస్తున్న అతనికి వివాహమై, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 15 రోజుల క్రితం అతని భార్య ఆడశిశువును ప్రసవించడంతో జూన్ 4న రవికుమార్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు.

భార్యాపిల్లలతో సంతోషంగా గడిపి, తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఈ నెల 17న బయలు దేరాడు. 20న ఢిల్లీకి చేరుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఛండీగఢ్ వెళ్లే ట్రైన్‌ వచ్చేందుకు సమయం ఉండటంతో ప్రైవేట్ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నట్లు చెప్పాడు.

అతనితో సంప్రదించేందుకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా తీయలేదని.. ఈ క్రమంలో హోటల్‌ గదిలో అపస్మారక స్థితిలో రవికుమార్ ఉన్నాడని, అతనిని ఆసుపత్రిలో చేర్పించినట్లు ఈ నెల 21న రాత్రి సమాచారం అందింది.

దీంతో తమ్ముడు ఈశ్వరయ్య మరో వ్యక్తితో కలిసి ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడ చికిత్స పొందుతూ రవికుమార్ మరణించాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?