ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫస్టు ఓటేసిన వైఎస్ జగన్

By narsimha lodeFirst Published Mar 23, 2023, 10:23 AM IST
Highlights


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇవాళ  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు .


అమరావతి:   ఎమ్మెల్యే  కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఏపీ  సీఎం వైఎస్ జగన్  గురువారంనాడు తన  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఇవాళ  ఉదయం  తొమ్మిది గంటలకు  ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  ప్రారంభమైంది.. పోలింగ్  ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎం జగన్  అసెంబ్లీ హల్ లో  ఏర్పాటు  చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి ఓటును  సీఎం జగన్  వేశారు. సీఎం తర్వాత   మంత్రులు  తమ  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

వైసీపీ  మొత్తం  ఏడుగురు అభ్యర్ధులను  బరిలో దింపింది.  విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధను టీడీపీ తన అభ్యర్ధిగా  బరిలో నిలిపింది.  బరిలో  దింపిన  ఏడుగురు అభ్యర్ధులను   గెలిపించుకొనేందుకు  వైసీపీ  పక్కా ప్రణాళికను  రచించింది. మంత్రులకు  ఎమ్మెల్యేల బాధ్యతలను అప్పగించింది.  అంతేకాదు  ఎమ్మెల్యేలను  సమన్వయం చేసేందుకు  సమన్వయకర్తలను కూడా  ఏర్పాటు  చేసింది. ఎమ్మెల్యేలు  ఓటింగ్  కు కచ్చితంగా  హాజరయ్యేలా  జాగ్రత్తలు తీసుకుంది. టీడీపీ, వైసీపీలు  విప్ లు  జారీ చేశాయి. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే దానిపై  వైసీపీ  ఎమ్మెల్యేలకు  మాక్ పోలింగ్  నిర్వహించారు.  అసంతృప్తిగా  ఉన్న  ఎమ్మెల్యేలతో  వైసీపీ అధిష్టానం  చర్చలు జరిపింది.  అసంతృప్త ఎమ్మెల్యేల సమస్యలు  పరిష్కారిస్తామని హమీలు ఇచ్చింది.  టీడీపీ నాయకత్వంతో  అసంతృప్త ఎమ్మెల్యేలు టచ్ లో కి వెళ్లకుండా  జాగ్రత్తలు తీసుకుంది. వైసీపీకి  చెందిన  ఎమ్మెల్యేలు  విడతల వారీగా  వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  

also read:ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయంపై వైసీపీ ధీమా, వ్యూహాత్మకంగా టీడీపీ
టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలతో  కలిసి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.   వైసీపీలో  అసంతృప్త ఎమ్మెల్యేలతో టీడీపీ నాయకత్వం టచ్ లోకి వెళ్లిందనే ప్రచారం కూడా సాగుతుంది.  వైసీపీకి చెందిన  16 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని  టీడీపీ  నేతలు  చెబుతున్నారు.  

click me!