నా రాజీనామా ఆమోదించారని మైండ్ గేమ్: వైసీపీపై గంటా ఫైర్

By narsimha lode  |  First Published Mar 23, 2023, 10:01 AM IST

 టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు  ఎమ్మెల్యే  పదవికి  చేసిన  రాజీనామా ఆమోదం పొందిందని  సోషల్ మీడియాలో  ప్రచారం సాగుతుంది.  ఈ ప్రచారంపై  గంటా శ్రీనివాసరావు  స్పందించారు.  


అమరావతి:  ఎమ్మెల్యే పదవికి  తన రాజీనామాను   స్పీకర్ ఆమోదించారని వైసీపీ మైండ్  గేమ్ ఆడుతుందని  మాజీ మంత్రి,  టీడీపీ  ఎమ్మెల్యే   గంటా శ్రీనివాసరావు  చెప్పారు.

గురువారంనాడు  టీడీపీ ఎమ్మెల్యే  గంటా శ్రీనివాసరావు   మీడియాతో మాట్లాడారు.  తమ ఎమ్మెల్యేలను  కాపాడుకొనేందుకు  వైసీపీ  ఈ ప్రచారం  చేస్తుందన్నారు.  తనను పిలవకుండా  తన రాజీనామాను ఆమోదించడం కుదదరని  ఆయన  అభిప్రాయపడ్డారు.  తమ పార్టీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ నామినేషన్  పత్రంపై తాను ప్రతిపాదిస్తూ  సంతకం చేసినట్టుగా  గంటా శ్రీనివాసరావు  గుర్తు  చేశారు.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా  కూడా  వచ్చిందని  గంటా శ్రీనివాసరావు తెలిపారు.ఈ సమయంలో తన  రాజీనామా ఆమోదిస్తే  వైసీపీ పెద్ద తప్పు  చేసినట్టేనని  ఆయన  అభిప్రాయపడ్డారు.  

Latest Videos

undefined

విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరణను  నిరసిస్తూ  విశాఖ నార్త్  ఎమ్మెల్యే,  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు  తన ఎమ్మెల్యే  పదవికి 2021  ఫిబ్రవరి 6వ తేదీన  రాజీనామాను చేశారు. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  ఆందోళనలు చేస్తున్న  జేఏసీ ప్రతినిధులకు  గంటా శ్రీనివాసరావు రాజీనామా  పత్రం అందించారు. స్పీకర్ ఫార్మెట్ లోనే   రాజీనామా  అందించినట్టుగా  గంటా శ్రీనివాసరావు  ప్రకటించారు.  అంతేకాదు ఈ రాజీనామా పత్రం  స్పీకర్ కార్యాలయానికి  చేరింది.   

తన రాజీనామాను  ఆమోదించాలని  గంటా శ్రీనివాసరావు  2022 మార్చి 14న  స్పీకర్ కు లేఖ అందించారు. అంతకుముందు  శ్రీకాకుళంలో  స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి  ఈ విషయమై  చర్చించిన విషయం తెలిసిందే.

also read:ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: విజయంపై వైసీపీ ధీమా, వ్యూహాత్మకంగా టీడీపీ

ఏపీలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో   ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదించారని  సోషల్ మీడియాలో  పెద్ద ఎత్తున  ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై  గంటా శ్రీనివాసరావు స్పందించారు.  

click me!