గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ: వీటిపైనే చర్చ (వీడియో)

Siva Kodati |  
Published : Jun 22, 2020, 05:30 PM ISTUpdated : Jun 22, 2020, 05:56 PM IST
గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ: వీటిపైనే చర్చ (వీడియో)

సారాంశం

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఏం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయనను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య సుమారు అరగంట పాటు భేటీ సాగింది

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఏం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఆయనను ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిద్దరి మధ్య సుమారు అరగంట పాటు భేటీ సాగింది.

కరోనా వైరస్ నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన విషయం తెలిసిందే. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత గవర్నర్‌ను ముఖ్యమంత్రి కలుస్తారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న చర్యలు, పెద్ద సంఖ్యలో నిర్వహిస్తున్న కరోనా నిర్థారణ పరీక్షలపై జగన్.. గవర్నర్‌కు వివరించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో  పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. 

Also Read:

రాజధాని రాజకీయంలో వేగం: గవర్నర్ తో జగన్ భేటీ, ఎం జరుగుతోంది..?

అప్పుడు మేం చేశాం.. ఇప్పుడు మీరు చేయలేరా: పెట్రోల్‌, డీజిల్‌పై జగన్‌కు చంద్రబాబు లేఖ

 

"

PREV
click me!

Recommended Stories

YS Jagan Flags Off Vehicles to Lok Bhavan | Crore Signatures Paper Transfer | Asianet News Telugu
BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu