ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 443 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 443 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,372కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 16704 మంది శాంపిల్స్ పరీక్షిస్తే 392 మందికి కరోనా సోకింది. 83 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఒక్కరోజులో ఐదుగురు మరణించారు. కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, అనంతపురంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు, విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ వైరస్ మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 111కి చేరుకొంది.
undefined
: 22/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7451 పాజిటివ్ కేసు లకు గాను
*3437 మంది డిశ్చార్జ్ కాగా
*111 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3903 pic.twitter.com/ulw9SVNPMV
also read:ఒక్క రోజులోనే అత్యధికం: ఏపీలో 8,929కి చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో అత్యధిక కేసుల్లో కర్నూల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 1354 కేసులు రికార్డయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణాలో 1063 కేసులు నమోదయ్యాయి.
ఇక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 1584 మందికి కరోనా సోకింది. ఇందులో 638 యాక్టివ్ కేసులు. కరోనా నుండి కోలుకొని 946 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.
విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిలో 337 కేసులు నమోదయ్యాయి. ఇందులో 285 యాక్టివ్ గా ఉన్నాయి. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.