ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో విచారణలో చెప్పారు: జేసీ లాయర్

By narsimha lodeFirst Published Jun 22, 2020, 5:03 PM IST
Highlights

ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలను విచారణ అధికారులకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన తరపు న్యాయవాది నార్పల రవికుమార్ రెడ్డి చెప్పారు.

అనంతపురం: ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో ఆ వివరాలను విచారణ అధికారులకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా ఆయన తరపు న్యాయవాది నార్పల రవికుమార్ రెడ్డి చెప్పారు.

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించిన కేసులో పోలీస్ కస్టడీ ముగియడంతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు ఇవాళ కడప జైలుకు తరలించారు.

రెండు రోజుల సమయాన్ని పోలీసులు సద్వినియోగం చేసుకొన్నారన్నారు. మరోసారి కస్టడీకి తీసుకొనే అవకాశం ఉండకపోవచ్చన్నారు. బెయిల్ కోసం ధరఖాస్తు  కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆయన చెప్పారు. విచారణ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకరరెడ్డి సమాధానమిచ్చారన్నారు. 

జేసీ ప్రభాకర రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అలాగే తుంటి ఎముక నొప్పిగా ఉండటంతో ఎక్స్‌రే కూడా తీశారని చెప్పారు మల్టిపుల్ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని.. ఒకే ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు.

 జేసీ ప్రభాకర రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు. అలాగే తుంటి ఎముక నొప్పిగా ఉండటంతో ఎక్స్‌రే కూడా తీశారని చెప్పారు. మెడికల్ రిపోర్టులను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టామన్నారు. కస్టడీ ముగియడంతో మరోసారి కడప జిల్లా జైలుకు తరలించారని జేసీ ప్రభాకరరెడ్డి అడ్వకేట్ నార్పల రవికుమార్‌రెడ్డి వివరించారు.

click me!