CM YS Jagan: అలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా? సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై సీఎం జగన్..

By Mahesh Rajamoni  |  First Published Jan 1, 2022, 2:26 PM IST

CM YS Jagan: గ‌త కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల ధ‌ర‌లు తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయితే ఈ అంశం రాజ‌కీయ ర‌గ‌డ‌కు కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జ‌గ‌న్‌.. సినిమా టికెట్ ధరల అంశంపై కీలక వ్యాఖ్య‌లు చేశారు. 
 


CM YS Jagan: గ‌త కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ రేట్ల ధ‌ర‌లు తీవ్ర చ‌ర్చ‌కు తెర‌లేపాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అయితే ఈ అంశం రాజ‌కీయ ర‌గ‌డ‌కు కార‌ణ‌మైంది. కోర్టుల వ‌ర‌కు వెళ్లింది. సినిమా టిక్కెట్ల రేట్ల త‌గ్గింపు నేప‌థ్యంలో రాజ‌కీయం చేసుకోవ‌డంపై అధికార పార్టీ ఇప్ప‌టికీ ఆగ్ర‌హం వ్యక్తంస్తోంది.  ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైకాపా అధికారంలో రావ‌డానికి ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన దాటుకుంటూ త‌మ ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.  వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు రూ.250 పింఛను పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించిన జగన్‌.. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.పెద్ద‌ల‌కు పించన్‌ను రూ. 2,500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Also Read: World Census: 9 సెకన్లకు ఒకరి జననం.. ప్రపంచ జనాభా ఎంతకు పెరిగిందో తెలుసా?

Latest Videos

undefined

 అలాగే, రాష్ట్రంలో ప్ర‌జ‌లంద‌రికీ మెరుగైన పాల‌న అందిస్తున్నామ‌నీ, దీని కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు తీసుకువ‌స్తున్నామ‌ని తెలిపారు. కులమతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నామ‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. పేదలకు మంచి చేస్తుంటే కొందరు దానిని రాజ‌కీయం చేస్తూ.. విమర్శించ‌డంపై ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌యంపైనా సీఎం జ‌గ‌న్ మాట్లాడారు.  సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండేందుకు సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తే.. దానికి కూడా   రాజ‌కీయం చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తే.. దానికి అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారు పేదలకు అనుకూలంగా ఉంటారా? అని  ప్రశ్నించారు. పేదలకు వ్యతిరేకంగా చర్యలకు దిగుతున్న వారి విషయంలో ప్రజలు ఒక సారి ఆలోచించాలని అన్నారు. ఇలాంటి వారు పేదల గరించి పట్టించుకునే వారు కాదనీ, పేదలకు వీరు శత్రువులు కాదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటీఎస్ పథకం విషయంలోనూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధంగా పేదలకు మేలు చేసే విషయాలను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.

Also Read: Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కార‌ణ‌మా?.. అసలు ఏం జరిగింది?  

రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నామని గర్వంగా చెబుతున్నానని సీఎం జగన్ అన్నారు. మంచి చేస్తుంటే విమర్శించేవాళ్లు కూడా ఉంటారని మండిపడ్డారు. విమర్శించే వాళ్లకు తాము చేసే అభివృద్ది కనిపంచడం లేదా అని ప్రశ్నించారు. అభివృద్దిని చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. కోర్టులకు వెళ్లి అభివృద్ది కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు. పేదలకు అమరావతిలో ఇల్ల స్థలాలు ఇస్తే.. కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యపు నేతలు ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. 

Also Read: coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !


 

Pedavaadiki andubaatulo pic.twitter.com/04IzhUiPdT

— Kalyan Babu™ (@ram_aduri)
click me!