జగన్ అనే నేను... ఆ దిశగానే పాలన సాగిస్తున్నాం: రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవంలో సీఎం

By Arun Kumar PFirst Published May 30, 2020, 12:11 PM IST
Highlights

వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఏకకాలంలో 10,641 భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించారు. 

అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఏకకాలంలో 10,641 భరోసా కేంద్రాలను సీఎం ప్రారంభించారు. అలాగే సీఎం యాప్ ను కూడా ప్రారంభించారు. ఏపీలోని రైతులకు ఇక ఈ భరోసా కేంద్రాల నుంచే సేవలు అందనుండగా, సీఎం యాప్ ద్వారానే రైతులకు నగదు చెల్లింపులు జరపనున్నారు.  

రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించి  విజ్ఙానాన్ని అందించేవిగా రైతు భరోసా కేంద్రాలు మారనున్నాయి. అంతేకాకుండా ఇంటిగ్రేటెట్ కాల్ సెంటర్(ఫోన్ నెంబర్ 155251) ద్వారా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను ఈ భరోసా కేంద్రాల ద్వారానే అందించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. 

''ఎన్నికల సమయంలో రెండు పేజీల మేనిపెస్టోను విడుదల చేశాం. అదే ఇప్పటికీ మాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత. కేవలం ఏడాది కాలంలోనే 90శాతం వాగ్దానాలు అమలుచేసే దిశగా అడుగులు వేశాం. ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఈ మేనిఫెస్టో కనిపిస్తుంది'' అని తెలిపారు. 

''వైఎస్ జగన్ అనే నేను మీ కుటుంబ సభ్యుడిగా మీకిచ్చిన మాటలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నానని అదే ప్రజల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అని అన్నారు.  

read more  వైద్యశాఖపై మేధోమథనం... భారీ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

''మేనిపెస్టోలో మొత్తం హామీలు 129 అయితే ఇప్పటికే అమల్లోకి వచ్చినవి 77, అమలుకోసం సిద్దంగా వున్నావి 36. ఇలా 90శాతం వాగ్దానాలు ఏడాదిలోనే పూర్తిచేశాం.  మరో 16 మాత్రమే అమలు కావాల్సి వుంది. మేనిపెస్టోలో చెప్పకపోయినా చేసినవి మరో 40 పథకాలను ప్రజలకు అందించాం'' అని తెలిపారు.   

''గ్రామ వాలంటీర్ల చేత రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి మేనిఫెస్టో ప్రతిని పంపిస్తాం. ప్రజలకు జవాబుదారీగా ఎలా వుండాలన్న దానికి ఇదే నిదర్శనం కానుంది. ఏడాది కాలంలో మేము ఏ మేరకు పనిచేశామన్నది ప్రజలకు తెలియజేయనున్నాం'' అన్నారు. 

''గత ప్రభుత్వం 2 లక్షల 60 వేల కోట్లు అప్పులు చేసింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 39వేల కోట్లు. ఒక్క విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలే 20 వేల కోట్లుగా వున్నాయి. కానీ మేము ఈ ఏడాది పాలనను చిత్తశుద్దితో చేశాం'' అని అన్నారు. 

''గత పాలనకు ఈ పాలనకు మధ్య తేడా ఇలా వుంది.  ఇంతకు ముందు మేనిపెస్టోలు బుక్కుకు బుక్కలు వుండేవి. 650 పైచిలుకు హామీలిచ్చి కనీసం 10 శాతం  కూడా అమలు చేయలేదు. కానీ మేం 90 శాతం పూర్తిచేశామని గర్వంగా చెబుతున్నా. గత ప్రభుత్వ పాలనలో గ్రామం నుండి రాజధాని వరకు ప్రతిదీ తమ మనుషుల చేతుల్లోనే వుండాలనుకునేవారు. ఇదే రాజధాని నగరంలో ఇళ్ల స్థలాలకు భూములిస్తామని చెబితే సామాజికి సమతుల్యం దెబ్బతింటుందని అడ్డుకున్నారు. భూములివ్వమని కోర్టుకు వెళ్లిన ప్రతిపక్షాలను చూశాం కానీ తామే ఇస్తామంటే అడ్డుకోవడం దారుణం'' అని మండిపడ్డారు.  

read more    ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్: సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో జగన్ సర్కార్

 ''గత ప్రభుత్వంలో ఏమయినా పథకాలు కావాలంటే జన్మభూమి మాఫియాల అనుమతి కావాలి. కానీ ఏ సిపారసు, రికమండేషన్ లేకుండా ఇంటివరకు వెళ్లి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం. రేషన్ కార్డు కావాలంటే 3వేలు, ఇల్లు కావాలంటే 15వేలు లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇలా టిడిపి ప్రభుత్వంలో ప్రతిదానికి ఒక రేటు. ఈ రోజు ఏ ఒక్కరికి లంచం ఇవ్వకుండానే పనులు జరుగుతున్నాయి. ఇదే గత ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి వున్న తేడా'' అని వివరించారు. 
  
''గ్రామ సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు డెడ్ లైన్ పెట్టి అందిస్తున్నాం. దరఖాస్తు నుండి లబ్దిదారుల లిస్ట్ వరకు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తాం.  సూర్యభగవానుడు ఉదయించక ముందే 1 తారీఖు అది ఆదివారమయినా, పండగయినా వాలంటీర్లు ఫెన్షన్లు అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల కంటే ఖచ్చితంగా పెన్షన్లు అందిస్తున్నాం'' అని వెల్లడించారు.   

''గతంలో పెన్షన్ కోసమో, ఏదయినా పథకం కోసమో వెళితే మీరు ఏ పార్టీ వారు అని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్కూళ్లలో బాత్రూంలు లేకపోవడంతో  చాలా మంది బాలికలు చదువు మానేసేవారు. కానీ ఆ పరిస్థితులకు మారుస్తూ నాడు-నేడు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీని ద్వారా స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నాం'' అని అన్నారు. 

 '' అతి త్వరలో1060 నూతన అంబులెన్స్ వాహనాలు(104,108 వాహనాలు) రోడ్డెక్కనున్నాయి. దీంతో నిరుపేదలకు  మరింత మెరుగైన వైద్య సదుపాయం అందనుంది. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఈ వ్యవస్థలన్నింటిని తిరిగి బలోపేతం చేస్తున్నాం'' అన్నారు.  

'' ఈ ఏడాది కాలంలోనే రైతుల ఖాతాల్లోకి రుణమాపి కింద 10వేల కోట్లు జమచేశామని... గత ప్రభుత్వంలో ఐదేళ్లలో 15వందల కోట్లు మాత్రమే రైతులకు చెల్లించిందన్నారు. ఇకపై ఎవరికి విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు కావాలన్నా ప్రభుత్వమే  అందిస్తుంది. అతి త్వరలో విత్తనాల పంపిణీని ప్రారంభించనున్నాం'' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. 


 

click me!