ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) సీఎం జగన్ భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సోమవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని (Tadepalli) నివాసం నుంచి సీఎం జగన్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ (Gannavaram AirPort) నుంచి సీఎం జగన్ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Narendra Modi) సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, విభజన హామీలను ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లనున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రధానిని కోరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి కేంద్రాన్ని కోరనున్నారు సీఎం జగన్. బీహార్ కి ప్రత్యేక హోదా పరిశీలన లో ఉందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్. ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని ప్రధానికి సీఎం జగన్ అందించనున్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వరద సాయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ప్రధాని కి వివరించనున్నారు సీఎం. వరదల సమయంలో తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని ప్రధానికి గతంలో సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే.రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలని తక్షణం పరిష్కరించాలని సీఎం కోరనున్నారు.