ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. రైతులు ఖాతాల్లోకి రూ. 1036 కోట్లు జమ.. నిధులు విడుదల చేసిన సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Jan 3, 2022, 11:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) రైతులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది.  మూడో విడత పెట్టుబడి సాయం కింద రాష్ట్రంలోని మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం జగన్ (YS Jagan) సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) రైతులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతులకు వైఎస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ కింద (YSR Rythu Bharosa-PM Kisan scheme) మూడోవిడత పెట్టుబడి సాయం‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని మొత్తం 50,58,489 మంది రైతుల ఖాతాల్లో రూ.1,036 కోట్లు జమ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‌మోహన్‌ రెడ్డి (YS Jagan) సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మీట నొక్కి నిధులు విడుదల చేశారు. కరోనా పరిస్థితులు ఉన్న రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పెట్టుబడి సాయం అందిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ. 2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేసింది. గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ. 2వేల చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు జమ చేసింది. కొత్తగా సాగు హక్కు పత్రాలు పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక, రైతు భరోసా లబ్దిదారుల జాబితాను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వైఎస్సార్‌ రైతుభరోసా– పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ. 5,863.67 కోట్లు జమచేశారు. తాజాగా మూడో విడుత కింద రూ.1,036 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.6,899.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇక, మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది.

click me!