విశాఖ జిల్లాలో దుర్ఘటన... టీవి పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

Arun Kumar P   | Asianet News
Published : Jan 03, 2022, 11:08 AM IST
విశాఖ జిల్లాలో దుర్ఘటన... టీవి పేలి ఇద్దరు చిన్నారులకు గాయాలు

సారాంశం

సాంకేతిక కారణాలతో టెలివిజన్ (టీవి) పేలి ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయిన దుర్ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.  

విశాఖపట్నం: ప్రతి ఇంట్లో ఇంటిల్లిపాదికి ఆనందాన్ని పంచే టీవి (television) ఆ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. సాంకేతిక కారణాలతో ఒక్కసారిగా భారీశబ్దం చేస్తూ టివి పేలిపోవడంతో (TV Blast) ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన విశాఖ జిల్లా (visakhapatnam district)లో చోటుచేసుకుంది. 

విశాఖ జిల్లాలోని బుచ్చయ్యపేట మండలం సీతయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదానికి గురయ్యారు. నిన్న ఆదివారం సెలవురోజు కావడంతో చిన్నారులిద్దరూ ఇంట్లోనే వున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ సరదాగా ఓ పాత టీవీ దగ్గర ఆడుకుంటుండగా వారూ ఎవ్వరూ ఊహించని విధంగా ప్రమాదానికి గురయ్యారు.  వారికి అతి సమీపంలో వున్న టీవి హటాత్తుగా భారీ శబ్దంతో పేలిపోవడంతో అక్కడే వున్న ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. 

టివిలో వుడే పిక్చర్ ట్యూబ్ (picture tube) పేలిపోవడంతో అందులో వుండే రసాయనాలు చిన్నారుల ముఖం, చేతులపై పడి గాయాలయ్యాయి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు చిన్నారులిద్దరినీ కేజిహెచ్ కు తరలించారు. ప్రస్తుతం పిల్లలిద్దరూ క్షేమంగానే వున్నట్లు... చికిత్స అందిస్తున్నట్లు జిజిహెచ్ డాక్టర్లు తెలిపారు.  

read more  వేడి వేడి సాంబార్ లో పడిన చిన్నారి మృతి.. మహాబూబాబాద్ లో దారుణం..

ఇదిలావుంటే క్రిస్మస్ (christmas festival) పండగపూటే ఓ చిన్నారి ప్రమాదానికి గురయి మృత్యువాతపడిన ఘటన ఏపీ (andhra pradesh)లో చోటుచేసుకుంది. ఊయలగా కట్టిన చీర బిగుసుకుని బాలుడు మృత్యువాతపడ్డాడు. సరదాగా చెట్టుకు చీరతో కట్టుకుని ఊయల ఊగుతుండగా చుట్టూ తిరగడంతో మెలిక పడింది. ఆ మెలిక బిగుసుకోవడంతో తీసుకోవడం సాధ్యంకాక అందులోనే చిక్కుకుని ఊపిరాడక చిన్నారి మృతిచెందాడు. 

కృష్ణా జిల్లా (krishna district) కోడూరు (koduru) మండలకేంద్రలోని బ్రహ్మణయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాలనీలో నివాసముండే రామాంజనేయులు, అంజలీ దేవి దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడి పేరు చైతన్య, రెండో కుమారుడి పేరు బాలవర్దన్. ఇద్దరు కుమారులు స్థానికంగా వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు.  

read more  తల్లిదండ్రులూ.. పిల్లలపై శ్రద్ధ వహించండి..! గాలిపటం ఎగరేస్తూ ఆరేళ్ల బాలుడు దుర్మరణం

అయితే క్రిస్మస్ పండగ సందర్భంగా సెలవు వుండటంతో అన్నదమ్ములు చైతన్య, బాలవర్దన్‌లు కాలనీలోని ఇతర మిత్రులతో కలిసి ఆడారు. తమ ఇంటి వెనుక ప్రాంతంలో చెట్టుకు చీరతో కట్టిన ఊయలలో ఆడేందుకు చైతన్య, బాలవర్దన్‌లు మిత్రులతో కలిసి వచ్చారు. చైతన్య హుషారుగా ఊయలలోకి ఎక్కి ఆడాడు. అలా ఆడుకుంటూనే చీరను మెలిపెట్టాడు. ఊయలను గుండ్రంగా తిప్పాడు. అంతే.. అది తన ప్రాణం తీసింది. 

చీర గట్టిగా మెడకు బిగుసుకుపోవడంతో తోటి స్నేహితులు చూస్తుండగానే చైతన్య ఊపిరి వదిలాడు. చీర మధ్యలో మాట్లాడకుండా విగత జీవిలా మారిపోయాడు. భయంతో చిన్నారులు పరుగున వెళ్లి చైతన్య తల్లిదండ్రులకు విషయం చెప్పారు. తల్లిదండ్రులు వెంటనే ఊయల దగ్గరకు వెళ్లారు. కానీ చైతన్య అప్పటికే ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా పడివున్నాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu