హడావుడే: కేసీఆర్ థర్డ్‌ఫ్రంట్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 2, 2018, 11:12 AM IST
Highlights

థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ హడావుడి చేసి వదిలేశారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.

అమరావతి: థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ హడావుడి చేసి వదిలేశారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు.  బీజేపీపై పోరాటం రాజకీయంగా అనివార్యంగా మారిందని.. ఈ పరిస్థితుల్లోనే  కాంగ్రెస్ పార్టీతో  కలవాల్సిన పరిస్థితులు  నెలకొన్నాయని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

శుక్రవారం నాడు టీడీపీ కార్యకర్తలు, నేతలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాంగ్రెస్ ‌పార్టీ చీఫ్ రాహుల్‌గాంధీని ఏ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చిందో  చంద్రబాబునాయుడు  వివరించారు.

నిరంకుశాన్ని ఎదిరించడం నేర్పిందే ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు. పెత్తందారీ విధానాన్ని  ప్రశ్నించడాన్ని ఎన్టీఆర్  నుండి నేర్చుకొన్నట్టు చెప్పారు. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం అనేది ఎన్టీఆర్ నిర్ధేశించేందేనని చంద్రబాబునాయుడు   పార్టీ కార్యకర్తలకు వివరించారు.

గోద్రా అల్లర్ల తర్వాత మోడీని రాజీనామా చేయాలని టీడీపీయే  డిమాండ్ చేసిన విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్ కు  టీడీపీ మద్దతు ఇవ్వనని ఖరాఖండిగా చెప్పిన విషయాన్ని బాబు టెలికాన్ఫరెన్స్ లో గుర్తు చేశారు. 

థర్డ్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ హడావుడి చేసి వదిలేశారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. రాజకీయ పరమైన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడడం వల్లే  బీజేపీపై పోరాటాన్ని  ప్రారంభించాల్సి వచ్చిందని చంద్రబాబునాయుడు పార్టీ  క్యాడర్‌కు వివరించారు. దేశం, రాష్ట్రం కోసం  ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదన్నారు.

సంబంధిత వార్తలు

గతాన్ని వదిలేసి పనిచేస్తాం: బాబుతో కలిసి రాహుల్

రాహుల్‌తో చంద్రబాబు భేటీ: తెలంగాణ సర్ధుబాట్లపైనా చర్చ

సేవ్ నేషన్ పోరు జోరు: పవార్, ఫరూక్ లతో బాబు భేటీ

బీజేపీయేతర ఫ్రంట్‌‌ వైపు బాబు అడుగులు: 20 ఏళ్ల తర్వాత

రాహుల్ గాంధీని కలుస్తా,జాతీయ పార్టీలను ఏకం చేస్తా:చంద్రబాబు

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

రాహుల్‌తో నేడు భేటీ: యూపీఏలోకి చంద్రబాబు

click me!