చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

Published : Nov 02, 2018, 10:36 AM IST
చంద్రబాబు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది.. కన్నా

సారాంశం

ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన పని వల్ల టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

 

టీడీపీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కన్నాలక్ష్మీనారాయణ శుక్రవారం ట్విట్టర్ వేధికగా స్పందించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ 1982లో  టీడీపీని స్థాపిస్తే... కుటిల రాజకీయ ప్రయోజనాలతో చంద్రబాబు 2018లో పార్టీని భూస్థాపితం చేశారని కన్నా విమర్శించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలపడం చూసి ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు.  1984లో చంద్రబాబును ఎందుకు పార్టీలో చేర్చుకున్నానా అని ఎన్టీఆర్‌ మదనపడుతూ ఉంటారని అన్నారు.

 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!