ఎండీఓలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ.....

By narsimha lodeFirst Published Aug 19, 2020, 2:31 PM IST
Highlights

వైఎస్ఆర్ చేయూత పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం  జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం నాడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకొన్నారు.

అమరావతి: వైఎస్ఆర్ చేయూత పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం  జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం నాడు సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకొన్నారు.

కేబినెట్ నిర్ణయాలను ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని మీడియాకు వివరించారు. వైఎస్ఆర్ ఆసరా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ. 27 వేల కోట్లను అందించనుంది.  మరో వైపు నూతన పారిశ్రామిక విధానానికి కూడ ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

also read:ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం: కీలక అంశాలపై చర్చ

పంచాయితీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో ఎండీఓలు ఈ విషయంలో పలుమార్లు కోరినా కూడ అప్పటి ప్రభుత్వం స్పందించలేదన్నారు. అయితే తమ ప్రభుత్వానికి ఎండీఓల అసోసియేషన్ నుండి లేఖ రావడంతో కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

రాయచోటిలో సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. మరోవైపు కడపలో పోలీస్ శాఖ బలోపేతానికి కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మంత్రి వివరించారు. సెప్టెంబర్ 1 రాష్ట్రంలో సంపూర్ణ పోషణ పథకం అమలు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

సెప్టెంబర్ 5వ తేదీ నుండి జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి చెప్పారు. సెప్టెంబర్ 11వ తేదీన వైఎస్ఆర్ ఆసరా పథకాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని మంత్రి చెప్పారు. 
 

click me!