మూడు రాజధానుల కేసు మరో బెంచ్‌కు బదిలీ, సుప్రీంకోర్టు ఆదేశాలు

Siva Kodati |  
Published : Aug 19, 2020, 02:14 PM IST
మూడు రాజధానుల కేసు మరో బెంచ్‌కు బదిలీ, సుప్రీంకోర్టు ఆదేశాలు

సారాంశం

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న మూడు రాజధానుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.

ఈ కేసుపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కాగా ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం జస్టిస్ నారీమన్ బెంచ్‌కు మూడు రాజధానుల కేసును బదిలీ చేశారు. అయితే ఈ కేసులో రైతుల తరుపన నారిమన్ తండ్రి పాలి నారిమన్ వాదిస్తుండటంతో ఆయన విచారణ నుంచి తప్పుకున్నారు.

అలాగే ఈ  కేసుకు సంబంధించిన విచారణను వేరే బెంచ్‌కు మార్చాలని జస్టిస్ నారిమన్ ఆదేశించారు. దీంతో ఈ కేసు వేరే బెంచ్‌కు బదిలీకానుంది. ఈ నేపథ్యంలో విచారణను మరోసారి వాయిదా వేస్తున్నట్లు  తెలిపింది.

కాగా పాలనా వికేంద్రీకరణ, రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu