కేసీఆర్‌కి జగన్ షాక్: పోతిరెడ్డిపాడు టెండర్ నేడే ఫైనల్

By narsimha lodeFirst Published Aug 19, 2020, 2:10 PM IST
Highlights

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై జగన్ సర్కార్ దూకుడును పెంచింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఇవాళ ఫైనల్ చేయనున్నారు.  సుభాష్ ప్రాజెక్ట్స్ మాన్యుప్యాక్చరర్స్  లిమిటెడ్ (ఎస్పీఎంఎల్) జాయింట్ వెంచర్ ఈ టెండర్ ను దక్కించుకొంది. 

అమరావతి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ (పోతిరెడ్డిపాడు) ప్రాజెక్టుపై జగన్ సర్కార్ దూకుడును పెంచింది. ఈ ప్రాజెక్టు టెండర్లను ఇవాళ ఫైనల్ చేయనున్నారు.  సుభాష్ ప్రాజెక్ట్స్ మాన్యుప్యాక్చరర్స్  లిమిటెడ్ (ఎస్పీఎంఎల్) జాయింట్ వెంచర్ ఈ టెండర్ ను దక్కించుకొంది.  రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను రూ. 3,307.07 కోట్లకు సుభాష్ కంపెనీ దక్కించుకొంది.

ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రైస్ బిడ్ ను సోమవారం నాడు కర్నూల్ ప్రాజెక్టుస్ సీఈ మురళీనాథ్ రెడ్డి తెరిచారు. అంతర్గత అంచనా విలువ మేర రూ. 3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు (రూ. 3,340.47 కోట్లు) కోట్ చేసిన సంస్థ ఎల్-1 గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించింది ప్రభుత్వం.

రివర్స్ టెండరింగ్ ను  నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ లో 0.88 శాతం అధిక ధర రూ. 3,307.07 కోట్లకు కోట్ చేశారు. కోట్ చేసిన ఎస్పీఎంఎల్  సంస్థ ఎల్ -1 గా నిలిచింది.  ఈ నివేదికను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ ఫైనల్ చేయనుంది. టెక్నికల్ కమిటీ ఫైనల్ చేయడమే తరువాయి.  ఇవాళ టెండర్ ను ఖరారు చేసి వర్క్ ఆర్డర్ ను జారీ చేయనున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి రోజూ 3 టీఎంసీల నీటిని డ్రా చేసి తెలుగుగంగ, కేసీ కెనాల్, గాలేరు -నగరి, ఎస్ఆర్‌బీసీ ఆయకట్టుకు నీటిని సరఫరా చేయనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

also read:పోతిరెడ్డిపాడుపై హైకోర్టుకు కాంగ్రెస్: ఈ నెల 24కి విచారణ వాయిదా

 

పోతిరెడ్డిపాడు నిర్మాణం పూర్తైతే తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్ , ఖమ్మం జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది.  టెండర్లను నిలుపుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం  సుప్రీంకోర్టులో కూడ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ నెల 21వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

పోతిరెడ్డిపాడు పనులను చేపట్టవద్దని కోరుతూ కృష్ణా బోర్డు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో చోటు చేసుకొన్న విబేధాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం చర్చించనుంది. ఈ నెల 25వ తేదీన  అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు.

click me!