విజయసాయిరెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలి - బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ

By Asianet News  |  First Published Nov 8, 2023, 2:05 PM IST

Sadhineni Yamini Sharma : విజయసాయి రెడ్డి గురివింద గింజ మాటలు మానుకోవాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ విమర్శించారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. తమ పార్టీ అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. 


Sadhineni Yamini Sharma : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినిశర్మ వైసీపీ (YCP) నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ నాయకులు దోపిడీ చేస్తూ నీతులు చెబుతున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) గురివింద గింజ మాటలు మానుకోవాలని సూచించారు. బీజేపీపై, తమ పార్టీ అధ్యక్షురాలి గురించి మాట్లాడటానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులంటే డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది‌ పేరని విమర్శించారు.

Nitish Kumar : జనాభా నియంత్రణపై బీహార్ సీఎం వ్యాఖ్యలు దుమారం.. క్షమాపణలు చెప్పిన నితీష్ కుమార్.. ఏం జరిగిందంటే

Latest Videos

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM Jagan mohan reddy) అవినీతిని ప్రశ్నిస్తే తమ పార్టీ అధక్షురాలిపై విమర్శలు చేస్తారా అని యామిని శర్మ అన్నారు. కల్తీ మద్యం తో పేదలు చనిపోయింది వాస్తవం కాదా ? అని అన్నారు. మైనింగ్, ఇసుక ద్వారా కోట్లు దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తే ఆ పథకాలకు సొంత పేర్లు పెట్టుకున్నారని ఆరోపించారు.

చెత్త నుంచి మరుగుదొడ్ల వరకు పన్నులు వసూళ్లూ చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై యామిని శర్మ మండిపడ్డారు. విద్యుత్ బిల్లులతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చేతకాని పాలనతో దేశంలోనే ఏపీ పేరును చెడగొట్టారని దుయ్యబట్టారు. ఎన్నికలలో ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చారని, వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఎంత అభివృద్ధి చేశారో  చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. 

విమానంపై నుంచి పడి ఎయిరిండియా ఇంజినీర్ మృతి.. అసలేం జరిగిందంటే ?

వైసీపీ ప్రభుత్వం అవినీతి గురించి పెద్ద చిట్టా చెబుతామని, చర్చకు రావాలని ఆమె కోరారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పార్టీ అధ్యక్షురాలిపై వ్యక్తిగత విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. విజయసాయి రెడ్డి, మంత్రుల కు బుర్ర ఉండే మాట్లాడుతున్నారా ? అని ఆమె ప్రశ్నించారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడిస్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.

విజయసాయి రెడ్డి  అంటే ఎవరో తెలియక ముందే పురంధేశ్వరి ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్న చరిత్ర వైఎస్ జగన్ కు ఉందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ..ఆయన కూతురైన తమ నాయకురాలిపై ఒక్క అవినీతి మచ్చ కూడా లేదని అన్నారు.

Mahmoud Abbas : పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పై హత్యాయత్నం.. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు మృతి..

బీజేపీ అడిగిన వాటికి సమాధానం చెప్పే దమ్ము లేక ఓ మహిళా నేతపై వ్యాఖ్యలు చేస్తారా అని యామిని ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే అవినీతి చేయలేదని చెప్పాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ నిజాయితీ నిరూపించుకునే ధైర్యం ఉందా అని అన్నారు. ఇంకో సారి నోరు పారేసుకుంటే.. మహిళలంతా కలిసి విజయసాయి రెడ్డి కి తగిన బుద్ధి చెబుతామని ఆమె హెచ్చరించారు. 
 

click me!