విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసిస్తూ వెయ్యి రోజులకు చేరిన ఆందోళన: కొనసాగుతున్న విద్యా సంస్థల బంద్

By narsimha lode  |  First Published Nov 8, 2023, 1:55 PM IST


కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం  ప్రైవేటీకరణ నిర్ణయాలను నిరసిస్తూ  కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్టణం కేంద్రంగా  సాగుతున్న  స్టీల్ ప్లాంట్  కార్మికుల ఆందోళన  వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది.



విశాఖపట్టణం: విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన ఆందోళన బుధవారం నాటికి  వెయ్యి రోజులకు చేరుకుంది.   విశాఖపట్టణంలోని  స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ  కార్మిక, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి  ఆందోళన నిర్వహిస్తున్నాయి.విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడ వ్యతిరేకిస్తున్నారు.  విశాఖస్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడిసరుకు  కోసం  ఐరన్ ఓర్  ను కేటాయించాలని  కంపెనీ యాజమాన్యం కోరుతుంది.  ఐరన్ ఓర్ గనులు లేకపోవడంతో  విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాటలోకి వెళ్తుందని కార్మిక సంఘాల జేఏసీ అభిప్రాయపడుతుంది.తమ సూచనల  మేరకు కంపెనీని నడిపితే లాభాల్లోకి వెళ్తుందని కూడ  కార్మిక సంఘాలు  చెబుతున్నాయి. 

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించాలనే  కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ 2021  ఫిబ్రవరి 3వ తేదీ నుండి  కార్మిక సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 2021-22 లో  విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్  రూ. 1000 కోట్ల లాభాలను ఆర్జించింది. విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరించవద్దని  కోరుతూ  ఆందోళనలు సాగుతున్నాయి. ఈ ఆందోళనలకు  అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి.  విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ  మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామాను సమర్పిస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. రాజీనామా లేఖను  కూడ ఆయన స్పీకర్ కు పంపారు.ఈ రాజీనామాపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

Latest Videos

undefined

విశాఖ స్టీల్ ప్లాంట్ లోని  అన్ని  యూనిట్లు నడిపితే  లాభాల్లో బాటలో నడిచే అవకాశం ఉందని యాజమాన్యం భావిస్తుంది. ఈ మేరకు నిధుల కోసం  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయత్నాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ  సాగుతున్న ఆందోళనల్లో లెఫ్ట్ పార్టీలకు చెందిన ట్రేడ్ యూనియన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

ఆందోళన నిర్వహిస్తున్న  కార్మిక సంఘాల జేఏసీ నేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను  జేఏసీ ప్రతినిధులు గతంలో కోరారు.ఈ విషయమై సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే ఏ కారణాలతో ఈ హామీ అమలుకు నోచుకోలేదు.

విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తూనే ఉంది.  దీంతో  కార్మిక సంఘాలు కూడ  తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన వెయ్యి రోజులకు చేరుకున్నందున  పలు రాజకీయ పార్టీల నేతలు  ఇవాళ  కార్మికులకు సంఘీభావం తెలిపారు.

ఇదిలా ఉంటే  స్టీల్ ప్లాంట్  కార్మికుల  ఆందోళన వెయ్యి రోజులకు చేరుకున్నందున   రాష్ట్రంలోని విద్యా సంస్థల బంద్ కు  ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, తదితర విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థల బంద్ కొనసాగుతుంది.  విద్యాసంస్థల బంద్ నేపథ్యంలో  విద్యార్థి సంఘాల నేతలు ఆయా విద్యాసంస్థల వద్ద ఆందోళనకు దిగారు.

click me!