అధికారమిస్తే.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం, బీజేపీ ఆఫీస్ ఇక్కడే: సోము వీర్రాజు

By Siva KodatiFirst Published Dec 28, 2021, 5:01 PM IST
Highlights

సర్పంచ్‌లకు నిధులు ఇస్తుంటే మీరు తీసుకుంటారా అంటూ ఏపీ ప్రభుత్వంపై బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని వుండాలని.. బీజేపీ ఆఫీసును కూడా ఇక్కడే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. మాకు అధికారం ఇస్తే మూడేళ్లలోనే రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. 

సర్పంచ్‌లకు నిధులు ఇస్తుంటే మీరు తీసుకుంటారా అంటూ ఏపీ ప్రభుత్వంపై బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) మండిపడ్డారు. విజయవాడలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు వచ్చిన నిధులను ప్రభుత్వం వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. విశాఖలోనే స్టీల్ ప్లాంట్ (vizag steel plant) ఉండాలని అమిత్ షాతో చెప్పామని వీర్రాజు స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే జగనన్న రైతు భరోసా కేంద్రాలను నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతున్నది బీజేపీయేనని వీర్రాజు స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ జిల్లాల్లో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని.. దేశంలో విద్యావ్యవస్థను కమ్యూనిస్టులు నాశనం చేశారని ఆయన ఆరోపించారు. 

నారాయణ (cpi narayana) కమ్యూనిస్ట్ కాదని... క్యాపిటలిస్ట్ అంటూ వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాలు విడిపోయి రాజధానిని నిర్మించుకున్నాయని.. చంద్రబాబు (chandrababu naidu) రైతులను మోసం చేసి, నడిరోడ్డుపై నిలబెట్టారని ఆయన మండిపడ్డారు. తిరుపతి వరకూ రైతులను నడిపించారని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోనే రాజధాని వుండాలని.. బీజేపీ ఆఫీసును కూడా ఇక్కడే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. మాకు అధికారం ఇస్తే మూడేళ్లలోనే రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. ఐదేళ్లు చంద్రబాబు సింగపూర్‌ను చూపించారని దుయ్యబట్టారు. ప్రభుత్వం పచ్చిసారా కాస్తుందా అంటూ ఆయన మండిపడ్డారు. 

Latest Videos

Also Read:కుళ్లిన గుడ్లు పెట్టి.. పిల్లలను ఆసుపత్రుల పాలు చేస్తారా: జగన్‌పై సోము వీర్రాజు ఆగ్రహం

జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదేని... మనం ఎందుకు భయపడాలి? మనం ఎప్పుడైనా జైలుకు వెళ్లామా అంటూ వీర్రాజు దుయ్యబట్టారు. ఆస్తులు పోగేసుకునేందుకే ఈ నేతల తాపత్రయమని... రాజకీయాల్లో నిరాడంబరత్వం చూపించిన పార్టీ మాదేనని ఆయన స్పష్టం చేశారు. ఏపీలోని అనేక హైవేలను కేంద్రం అభివృద్ధి చేస్తోందని.. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ సభ పెట్టామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని వీర్రాజు ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని  ముందు చంద్రబాబును అడగాలని.. ఇది నీతి ఆయోగ్‌ పరిధిలో ఉందని ఆయన పేర్కొన్నారు.   

ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు (gvl narasimha rao) మాట్లాడుతూ... వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వమంటూ దుయ్యబట్టారు రాష్ట్రంలో టీడీపీకి భవిష్యత్తు లేదని.. బీజేపీ అంటే భవిష్యత్తులో జయించే పార్టీ అని ఆయన అభివర్ణించారు. మోడీ పట్ల ప్రజల్లో భక్తి భావం ఉందని.. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిదులు ఏమవుతున్నాయని జీవీఎల్ నిలదీశారు. రాష్ట్రం ఎందుకు ఆర్థిక సంక్షోభంలో ఉందని.. అవినీతిమయం కాని రంగం రాష్ట్రంలో ఏదీ లేదని ఆయన ధ్వజమెత్తారు.  మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు (ravela kishore babu) మాట్లాడుతూ...కోటి మంది దళితులు వైసీపీకి గంపగుత్తుగా ఓటు వేశారని గుర్తుచేశారు. కానీ దళితులపై వైసీపీ ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడుతోందన్నారు. ఎస్సీ నియోజకవర్గం తాడికొండలో అమరావతి రాజధానికి ప్రధాని శంకుస్థాపన చేశారని... దళితులు బాగుపడటం ఇష్టంలేకే వైసీపీ రాజధాని మార్చాడానికి నిర్ణయం తీసుకుంది అని రావెల ఆరోపించారు.   

click me!