ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్... కోటి మంది మహిళలకు చేరువలో దిశ యాప్...: డిజిపి గౌతమ్ సవాంగ్ (Video)

By Arun Kumar PFirst Published Dec 28, 2021, 4:55 PM IST
Highlights

2021 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు పనితీరు ఎలా వుందో రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ వివరించారు. 

మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ (friendly policing) కొనసాగుతోందని... సామాన్యులు సైతం దైర్యంగా పోలీసుల దగ్గరకు వెళ్ళగలుగుతున్నారని రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ (ap dgp goutham sawang) వెల్లడించారు. గతంలో ఇటువంటి పరిస్థితి వుండేది కాదని... పోలీసులను చూసి సామాన్యుడు బయడిపోయేవారని అన్నారు. ఆ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందని డిజిపి పేర్కొన్నారు. 

రాష్ట్రంలో పోలీసుల పనితీరులో కూడా చాలా మార్పులు వచ్చాయని డిజిపి పేర్కొన్నారు. ఎలాంటి నేరం జరిగినా వెంటనే ఇన్వేస్టిగేషన్ (investigation) పూర్తిచేసి ఛార్జీషీట్ (charge sheet) దాఖలు చేయడం గత ఐదు సంవత్సరాల కాలంలో 75.09 శాతం మెరుగయ్యిందన్నారు. అలాగే సిఎడబ్ల్యూ (CAW) కూడా 42 శాతం మెరుగయ్యిందని డిజిపి వెల్లడించారు.   

Video

ఇక దిశ చట్టం తీసుకొచ్చినప్పుడు అంత తక్కువ కాలంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? అనే అనుమానాలను అందరిలో వుండేదని... దాన్ని పటాపంచలు చేసి త్వరతగతిన ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు నమోదు చేస్తున్నామని డిజిపిపేర్కొన్నారు. దిశ యాప్ కు మంచి ఆదరణ లభిస్తోందని...ఇప్పటికే 97లక్షలకు పైగా మహిళలు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. కోటి డౌన్ లోడ్స్ టార్గెట్ ను త్వరలోనే పూర్తిచేసుకుంటాయని డిజిపి వెల్లడించారు. 

read more  2021 Crime Roundup: భారీగా పెరిగిన క్రైమ్ రేట్... మహిళలపై అత్యాచారాలు కూడా..: రాచకొండ సిపి వెల్లడి

స్పందన (spandana) లో భాగంగా 1,63,033 పిటిషన్స్ వస్తే 40,404 ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. మిగతావి కూడా విచారణ జరిపి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. గతంలో మాదిరిగా కాక పోలిస్ స్టేషన్ లోకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందన్నారు. మైనర్ లు కూడా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందని డిజిపి పేర్కొన్నారు. 

ఆపరేషన్ పరివర్తనలో  భాగంగా ఏజన్సీ ఏరియాలో 2,762 ఎకరాల గంజాయి సాగును ద్వంసం చేశామన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన 43,293 కేసుల్లో 60,868 మందిని అరెస్ట్ చేసామని...20 ,945 వాహనాలను స్వాధినం చేసుకున్నామని డిజిపి సవాంగ్ తెలిపారు.

read more  గంజాయి వెనుక నక్సల్స్‌ పాత్ర.. అదే వారి ఆదాయ వనరు : డీజీపీ

టెక్నాలజీ ద్వారా నేర పరిశోదన కొత్త పుంతలు తోక్కుతుందని డిజిపి పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్ సెంట్రల్ లాక్, ఇన్వేస్టిగేషన్ ట్రాకర్, జిఐయస్, జిపియస్ వంటి టెక్నాలజీని పోలీసులు ఉపయోగిస్తున్నట్లు డిజిపి సవాంగ్ వెల్లడించారు. 

click me!