నాడు ఆంధ్రులను ద్రోహులని.. ఏపీలో అడుగు పెట్టగలరా, బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్సే : కేసీఆర్‌పై సోము వీర్రాజు

Siva Kodati |  
Published : Oct 08, 2022, 02:59 PM IST
నాడు ఆంధ్రులను ద్రోహులని.. ఏపీలో అడుగు పెట్టగలరా, బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్సే : కేసీఆర్‌పై సోము వీర్రాజు

సారాంశం

ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన చంద్రశేఖర్‌ రావుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అర్హత లేదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు . వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు.   

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ వ్యవహారం తెలుగునాట ఆసక్తికర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు. ఆంధ్రులను ద్రోహులుగా వర్ణించిన చంద్రశేఖర్‌ రావుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అర్హత లేదన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్‌పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారు. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని.. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. 

ALso REad:ఆషామాషీగా జాతీయ పార్టీ పెట్టలేదు.. సీఎంగానే దేశమంతా తిరుగుతా, మహారాష్ట్ర నుంచే మొదలు : కేసీఆర్

అంతకుముందు తెలంగాణ మోడల్ దేశంలో అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్ . బుధవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ముందుగా కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు దారి తీసిన పరిస్థితులను కేసీఆర్ వివరించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుందనే విషయమై కేసీఆర్ వివరించారు.

బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల  దేశంలో వెనుకబడిపోతుందన్నారు. బంగ్లాదేశ్ కంటే మన దేశం వెనుకబడి ఉండడం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. అఖిలేష్ యాదవ్ ను ఈ సమావేశానికి రావొద్దని తానే చెప్పినట్టుగా తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈ కారణంగానే తాను అఖిలేష్ ను రావొద్దని చెప్పానని... ములాయం కోలుకున్న తర్వాత అందరం కలిసి వస్తారనే ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం చెప్పారు. రైతు సంక్షమమే ఎజెండాగా ముందుకు సాగుతామని కేసీఆర్ వివరించారు. మహరాష్ట్ర నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కర్ణాటకలో కూడా మన జెండా ఎగురాలని కేసీఆర్ ఆకాంక్షించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్