కాకినాడ జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

Published : Oct 08, 2022, 01:45 PM IST
కాకినాడ జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది..

సారాంశం

కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాండ్రేగులలో ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతిచెందింది. 

కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాండ్రేగులలో ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతిచెందింది. మృతిచెందిన యువతిని దేవకిగా గుర్తించారు. వివరాలు.. గుబ్బల వెంకట సూర్యనారాయణ అనే వ్యక్తి దేవకిని కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దేవకి తన ప్రేమను నిరాకరించడంతో ఆమెపై కోపాన్ని పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆమె స్కూటీపై ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఆమెను వెంబడించి దాడి చేశాడు. యువతి గొంతు కోశాడు. దీంతో యువతి రోడ్డుపై పడిపోయింది. 

అయితే దీనిని గమనించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే తీవ్రంగా గాయపడిన దేవకి అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెద్దపూడి పోలీసులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే యువతిపై దాడికి పాల్పడి ప్రాణాలు తీసిన సూర్యనారాయణను స్థానికులు పట్టుకున్నారు.  అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో యువతి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్