సీఎంతో గోడు వెళ్లబోసుకున్న ఆక్వా రైతులు.. జగన్ సీరియస్‌, మంత్రులతో కమిటీ ఏర్పాటు

By Siva KodatiFirst Published Oct 8, 2022, 2:25 PM IST
Highlights

ఆక్వా రైతుల ఫిర్యాదులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీని నియమించారు. 

ఆక్వా రైతుల ఫిర్యాదులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఆక్వా ధరల పతనంతో పాటు అక్వా ఫీడ్ పెంపుపై సీఎంను కలిసిన కొందరు రైతులు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా సిండికేట్‌గా మారి రైతులకు నష్టం కలిగించడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో కమిటీని నియమించారు. కమిటీలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అప్పలరాజు, సీఎస్‌తో పాటు సీనియర్ అధికారులు వున్నారు. వారం రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాల్సిందిగా జగన్ ఆదేశించారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. 

click me!