ఏపీ అసెంబ్లీలో గందరగోళం: 4 టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

By Nagaraju penumalaFirst Published Jul 25, 2019, 2:42 PM IST
Highlights

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదనతో నలుగురు శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ సీతారాం. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ శాసన సభ్యులపై మరోసారి వేటు పడింది. నలుగురు శాసన సభ్యులను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారం. అసెంబ్లీలో రాష్ట్ర విభజన, పునర్విభజన చట్టంలోని అంశాలపై వాడీ వేడిగా చర్చ జరుగుతోంది.

అయితే సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ బాబు, వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్, డోల బాల వీరాంజనేయులను సస్పెండ్ చేయాలని శాసన సభవా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదించారు. 

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదనతో నలుగురు శాసన సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ సీతారాం. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేయడంతో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీలో నదీజలాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ రగడ: రోడ్డెక్కిన చంద్రబాబు, నిరసన ర్యాలీ (వీడియో)

టీఆర్ఎస్ తో పొత్తుకోసం మీరు పాకులాడొచ్చు, మేం భవనాలు ఇస్తే తప్పా?: చంద్రబాబుపై బుగ్గన ఫైర్

అసెంబ్లీలో గందరగోళం: సభ నుంచి టీడీపీ వాకౌట్, పారిపోయారన్న వైసీపీ

click me!