చంద్రబాబులో ఈ మార్పు గమనించారా?

Published : Jan 15, 2017, 06:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
చంద్రబాబులో ఈ మార్పు గమనించారా?

సారాంశం

చంద్రబాబు బహిరంగ సభలలో, మాట్లాడే తీరులో  బిత్తర  కనిపిస్తూ ఉంది. ఓటేయడం మరచిపోవద్దని చేతులు జోడించడం మొదలుపెట్టారు

బాగా గమనించండి. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లో  ఈ మధ్య ఒక విధమయిన అదుర్దా  కనబడుతుంది.

 

ఆయనలో ఎదో తెలియని ఉద్రికత్త  చోటుచేసుకున్నట్లనిపిస్తుంది.

 

ఇది రెండు విషయాలలో స్పష్టమవుతుంది.ఒకటి, ముఖ్యమంత్రికార్యాలయంలో రివ్యూలు తగ్గించి, ఎక్కువ బహిరంగ సమావేశాలలోప్రసంగిస్తున్నారు.  ప్రారంభోత్సవమో, శంకస్థాపనో, జన్మభూమియో... ఇలా  ఏదో ఒక సమావేశం పేరుతో రోజూ రెండు జిల్లాలలో తిరుగుతున్నారు. రెండుమూడు మీటింగులలో మాట్లాడుతున్నారు. ఇక రెండో విషయం, ప్రతిసమావేశం ఒక విజ్ఞప్తితో ముగుస్తున్నది. ’ మీకు అవి చేశా.. ఇది చేశా. పెన్షన్లిచ్చా. నీళ్లిచ్చా, రుణమాఫీ చేశా. కరెంటు ఇచ్చా. అందువల్ల మీకు మేలు చేసినవన్ని గుర్తుపెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లో ఓటేయండి....’

 

ఎన్నికలింకా రెండున్నరేళ్లున్నాయి. అపుడే ఆయన తన మీటింగులకు తోలుకొచ్చిన వారిని ఎన్నికల వైపు మళ్లిస్తున్నారు. ఎందుకు? అంత తొందరేమొచ్చింది. ఆయనేమయిన అపశ్రతి పసిగడుతున్నారా? 

 

ఈ మైండ్ సెట్ లోకి వెళ్లాడు కాబట్టి ప్రతి సమావేశంలో  జెసి దివాకర్ రెడ్డి   ‘ప్రార్థన’  కార్యక్రమం విధిగా ఏర్పాటు చేస్తున్నారు.

 

ప్రజలలో ప్రతిపక్ష నాయకుడిని రాక్షసుడిగాచిత్రించడం, తను అపద్భాంధవుడిగా ఒక రెడ్డిచేత దండకం వినిపించడం... మామూలు విషయం కాదు.  వర్ ల్డ్ క్లాస్  రాజధాని అమరావతి గురించి ,సింగపూర్ గురించి మాట్లాడడం తగ్గించి పేదల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. మరొక నాలుగు లక్షల మందికి పెన్షన్  ఇస్తామని, మరొక కోటి ఇళ్లు కట్టిస్తామని ప్రచారం చేయడం ఆరంభించారు. ఒక కొత్త అరోగ్య బీమా ప్రవేశపెట్టారు.

 

 

ఇందులో ఎదో మతలబు ఉండాలి. మధ్యంతర ఎన్నికలను వూహిస్తున్నారా లేక  లేని పోని ఆశలు కల్పించినందు వల్ల  2004  పరిస్థితి పునరావృతమవుతుందని భయపడుతున్నారా?

 

తెలుగుదేశం పార్టీపై ప్రజలలో అసహనం మొదలయిందని అనే  పరిస్థితిని వేగుల వారు  ఆయనకు చేరవేశారా?రకరకాల మీటింగులు పెట్టి, తను చేసినవే కాదు,గతంలో ఎవరో చేసినవి కూడా తనవిగా చెప్పుకుని  జనంలో  ఆదరణ పెంచుకోవాలని తంటాలు పడుతున్నట్లు అర్థమవుతుంది.

 

ముఖ్యమంత్రి ఆందోళన కు తగ్గట్టుగా పెద్ద సంఖ్యలో మహిళల (స్వయంసహాయంక సంఘాలు) తోలుకురావడం, వాళ్ల ముందన తనను తాను పొగడుకోవడం, తర్వాత జెసి లాంటి వారితో పొగిడించుకోవడం ఒక కార్యక్రమం అయింది.

 

ముచ్చు మర్రి, కడప, శ్రీకాకుళం... ఒకటేమిటి అన్నింటా ఇదే తంతు.  దివాకర్ రెడ్డి పొగుడుతూ ఉంటే ఆయన ముసిముసినవ్వులు నవ్వుతూ వింటూ  ఉంటున్నారు. కాకపోతే, చప్పట్లు కొట్టడం లేదంతే.

 

కారణం ఏమయి ఉంటుంది. తెలుగుదేశంలోనే ఒక వర్గం నుంచి వినిపుడుతన్న విషయం ఇది.ఈ మధ్య కొన్ని సర్వేలు జరిగాయి. ఏ సర్వే కూడా నిప్పులాంటి  మనిషి నాయకత్వంలో ఉన్న రూలింగ్ పార్టీకి  అరవై నుంచి డెబ్బయి సీట్లు చూపలేదట. 

 

ఆయన ప్రవర్తనలో వచ్చిన తాజా మార్పుకు  ఇదే కారణమా

 

PREV
click me!

Recommended Stories

ISRO Set to Launch LVM3-M6 with BlueBird Block-2 Satellite | Students Reaction | Asianet News Telugu
Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu