కోస్తాంధ్రలో నేడూ, రేపూ భారీ నుంచి అతి భారీ వర్షాలు

By AN TeluguFirst Published Nov 3, 2021, 11:49 AM IST
Highlights

ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నేడూ రేపూ భారీనుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. 

బంగాళాఖాతంలోని అల్పపీడనం కన్యాకుమారివద్ద కొనసాగుతోంది. ఇది క్రమంగా అరేబియా సముద్రంలోకి వెళుతోంది. భూ ఉపరితలానికి దగ్గరగా తూర్పు పవనాలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో నేడూ రేపూ భారీనుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు తెలంగాణలో చెదురుమదురుగా భారీ వర్షాలు పడతాయి. రాయలసీమలో నేటినుంచి మూడు రోజులు చెదురుమదురుగా భారీ వర్షాలు కురుస్తాయి. 

తెలంగాణలోనూ భారీవర్షాలు..

తెలంగాణలో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు భారీ వర్షాలు కురుస్తాయని, గురువారం నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. 

గత‌నెల 27న దక్షిణ బంగాళాఖాతంలో (bay of bengal) ఏర్పడిన అల్పపీడనం.. శ్రీలంక సమీపంలోని కొమరిన్ పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరిన్ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 

ఇక, తెలంగాణలో మంగళవారం 109 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జనగామ జిల్లా కోలుకొండలో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.  జనగామ జిల్లా కోరుకొండ లో అత్యధికంగా 7.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. 

జన‌గామ, హన్మకొండ, వరం‌గల్‌, యాదాద్రి భువ‌న‌గిరి, వన‌పర్తి, భద్రాద్రి కొత్త‌గూడెం, సిద్ది‌పేట, ఖమ్మం, నారా‌య‌ణ‌పేట, మేడ్చల్‌ మల్కా‌జి‌గిరి, సూ ర్యా‌పేట, మహ‌బూ‌బా‌బాద్‌,మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, రంగా‌రెడ్డి, నల్ల‌గొండ, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, జోగు‌లాంబ గద్వాల జిల్లాల్లో పలు‌చోట్ల వర్షం కురి‌సిం‌దని వాతావరణ శాఖ వెల్లడించింది.  జాఫర్‌గఢ్‌లో 5.2, పాలకుర్తిలో 4.3, వర్ధన్నపేటలో 3.2, పంగల్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది. 

మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత కూడా మొదలైంది. ఇప్పటికే పలు జిల్లాలను చలి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిలో మంగళవారం తెల్లవారుజామున అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఏపీలో కురుస్తున్న వర్షాలు.. నవంబర్ 6న మరో అల్పపీడనం.. తుపాన్‌గా మారే ఛాన్స్..

ఇక, నవంబర్ 6వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 30న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతం సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. 

ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి.  దక్షిణ కోస్తా, రాయలసీయ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడనానికి అనుబంధగా ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగింది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిశాయి. 

click me!