జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం.. ‘అవసరమైతే సిట్ వేస్తాం’.. సాయంత్రానికల్లా ఉత్తర్వులు

By telugu teamFirst Published Nov 2, 2021, 3:22 PM IST
Highlights

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో తెలియజేయాలని సీబీఐని అడిగింది. కానీ, దీనికి సీబీఐ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయింది. మేం చెప్పింది వినకపోతే.. మీ మాటులు వినాల్సిన అవసరం లేదు. ఈ కేసులో అవసరమైతే సిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. సాయంత్రానికల్లా ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించింది. 
 

అమరావతి: జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలపై నమోదైన కేసులో Andhra Pradesh High Court ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా CBIపై సీరియస్ అయింది. పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని సీబీఐ ఇవ్వలేదు. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మేం చెప్పింది వినకపోతే... మీరు చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఏం చేయాలో మేం ఆదేశాలిస్తామని తెలిపింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తామని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన హైకోర్టు ఆదేశాలపై అసంతృప్తి రగిలింది. ఈ సందర్భంగానే Social Mediaలో Judgeలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొందరు పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై కేసు నమోదైంది. కేసు నమోదై విచారణ జరుగుతున్న తర్వాత కూడా పంచ్ ప్రభాకర్ అభ్యంతరకర పోస్టులు పెట్టారు.

Also Read: జడ్జిలపై అభ్యంతకర వ్యాఖ్యలు: మరో ఆరుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ

ఈ కేసులో హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో కేంద్రం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ అశ్వినీ కుమార్ వాదనలు వినిపించారు. పంచ్ ప్రభాకర్ పోస్టులను తొలగించిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్‌లలో పోస్టులు తొలగించారని వివరించారు. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి లేఖ రాగానే రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 

ఇదే తరుణంలో తాము కూడా సామాజిక మాధ్యమాలకు లేఖ రాశామని సీబీఐ వివరించింది. సీబీఐ లేఖతో ఏం ప్రయోజనం ఉంటుందని హైకోర్టు ప్రశ్నించింది. అదికాకుండా, పంచ్ ప్రభాకర్‌ను ఎలా అరెస్టు చేస్తారో వివరించాలని అడిగింది. దీనిపై సీబీఐ సరైన సమాధానమివ్వలేదు. దీంతో న్యాయస్థానం మండిపడింది. మేం చెప్పింది వినకపోతే.. మీ మాటలు వినాల్సిన అవసరం లేదని తేల్చేసింది. ప్రాసిక్యూషన్ ఏం చేయాలో తాము ఆదేశిస్తామని తెలిపింది. అవసరమైతే సిట్ ఏర్పాటుపై ఆలోచిస్తామనీ వివరించింది. ఈ విషయమై సాయంత్రానికల్లా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి తొలుత సీఐడీ దర్యాప్తు చేసింది. కానీ, తర్వాత ఈ కేసులను న్యాయస్థానమే సీబీఐకి అప్పగించింది.

click me!