భార్య ఉరేసుకుందని చెప్పి.. భర్త పరార్, అనుమానాస్పదంగా వివాహిత ఆత్మహత్య...

By AN TeluguFirst Published Nov 3, 2021, 9:17 AM IST
Highlights

యూసఫ్ మరో యువతితో వివాహేతర సంబంధం నడుపుతున్న విషయం నఫిసా బేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. 

పెడన : కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడా? భార్య మెడకు వైరుతో ఉరి బిగించి హత్య చేసి.. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. పెడన పట్టణంలోని ఐదో వార్డు దాదాగుంట సమీపంలో అక్టోబర్ 26న అనుమానాస్పద స్థితిలో Died చెందిన వివాహిత నఫిసా బేగం (31) కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తు పోయే వాస్తవాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఈ కేసును తొలుత Suspicious caseగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు హత్య కేసుగా మార్చారు. దీనికి సంబంధించి ఎస్ఐ టి. మురళి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మచిలీపట్నం పరాసుపేటకు చెందిన నఫిసా బేగంను పెడన దాదాగుంటకు చెందిన ఎండీ యూసఫ్ కు ఇచ్చి ఎనిమిదేళ్ళ కిందట వివాహం చేశారు.

వీరికి ఏడేళ్ల బాబు. వివాహమైన నెల రోజుల నుంచి వీరి మధ్య Conflicts జరగసాగాయి. ఈ క్రమంలో యూసఫ్ మరో యువతితో Extramarital affair నడుపుతున్న విషయం నఫిసా బేగంకు తెలియడంతో ఆ గొడవలు పెద్దవయ్యాయి. యూసఫ్ తనకు అప్పులున్నాయని, పుట్టింటి నుంచి నగదు తీసుకురావాలని భార్యను వేధించసాగాడు. 

ఈ విషయమై అక్టోబర్ 26న ఇరువురి మధ్య వాగ్వాదం జరగ్గా.. అకస్మాత్తుగా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తుకొచ్చిన యూసఫ్ తన భార్య వంటింట్లో Hanging వేసుకుందని కిందకు దించానని చెప్పి.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై మృతురాలి సోదరుడు మహమ్మద్ గౌస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో యూసఫ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు పోస్టు మార్టం నివేదిక ఆధారంగా విచారించారు. ఈ విచారణలో నఫిసాబేగంది ఆత్మహత్య కాదని తేల్చి.. నిందితుడిమీద హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం.. ‘అవసరమైతే సిట్ వేస్తాం’.. సాయంత్రానికల్లా ఉత్తర్వులు

బిల్డర్ హత్య??

 విశాఖ నగరానికి చెందిన  పీతల అప్పల రాజు అలియాస్ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది.  దీనిపై పోలీసులు  విభిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

విశాఖ ఎంవిపి కాలనీ కి చెందిన  అప్పలరాజు  విజయవాడకి వెళ్లి Builder గా ఎదిగారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అజిత్ సింగ్ నగర్ క్రిష్ణ హోటల్ కూడలిలో ఆర్పీ కన్స్ట్రక్షన్స్ పేరుతో కార్యాలయ నడుపుతున్నారు.  రాజుకు భార్య  ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కుమారుడు ప్రవీణ్ ఎంబీఏ చదువుతున్నాడు.  

కుమార్తె రేష్మకు ఆగస్టులో  విశాఖలోనే వివాహం చేశారు.  సుమారు మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను తీసుకుని MVP Sector-9 లో సొంత ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు.  తాను Vijayawadaలోనే ఉంటూ భవన నిర్మాణ  కాంట్రాక్టులు చేస్తున్నారు.  దసరా పండుగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లే ఇంతలోనే Murderకు గురికావడంతో బంధువులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తో…
అప్పలరాజు అతడి వద్ద పనిచేసే సాయికుమార్ ఓకే భవనంలో అద్దెకు ఉంటున్నారు.  బిల్డర్ పై అంతస్తులో సాయికుమార్ తన కుటుంబంతో కలిసి  కింది అంతస్తులో ఉంటున్నారు.  పనిచేసే మరో వ్యక్తి వెంకటేష్ సోమవారం ఉదయం వారి వద్దకు వచ్చాడు.  అప్పలరాజు ఫోన్ లిఫ్ట్ చేయడం  లేదని సాయి కుమార్ తో అన్నాడు.  దీంతో పైకి వెళ్లి చూడగా బిల్డర్ హత్య వెలుగుచూసింది.

 

click me!