ఏపీకి ఇక రాజధాని ఉండదు... జగన్ నూతన చట్టం ఇదే!

By telugu teamFirst Published Jan 14, 2020, 12:40 PM IST
Highlights

జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఒక ప్రకటన వెలువడనుందని అందరూ ఊహిస్తున్నట్టే...జగన్ "ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం, 2020" ను తీసుకురానున్నారు. 

అమరావతి: జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఒక ప్రకటన వెలువడనుందని అందరూ ఊహిస్తున్నట్టే...జగన్ "ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం, 2020" ను తీసుకురానున్నారు. 

అధికార వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ చట్టాన్ని తీసుకువస్తున్నట్టు ఇందులో పొందుపరిచారు. రాష్ట్రంలోని అధికార కార్యాలయాలను, వేర్వేరు శాఖలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా అన్ని ప్రాంతాల సమానాభివృద్ధిని సాధించడం ఈ చట్టం ముఖ్యోద్దేశమని పొందుపరిచారు. 

ఇందుకోసం, రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించనున్నట్టు ఆ చట్టం ముసాయిదాలో తెలిపారు. ముఖ్యమంత్రితో సహా 9 మంది సభ్యులు కలిగిన ఒక బోర్డు పరిపాలన కిందకు ప్రతి జోను వస్తుందని ఈ చట్టంలో పేర్కొన్నారు.

Also read: పవన్, బాబులకు చెక్: అమరావతిపై వైఎస్ జగన్ సరికొత్త వ్యూహం

ఈ చట్టం అనుకున్న ఫలితాలను సాధించేలా ఈ బోర్డు చూసుకుంటుందని, చట్టం అమలు సాఫీగా జరిగేలా, ఆ జోన్ సమగ్రంగా అభివృద్ధి చెందేలా అవసరమైన సలహాలను రాష్ట్రప్రభుత్వానికి అందించనుంది ఈ బోర్డు. 

ఈ బోర్డుకు ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరించనుండగా, మరో వైస్ చైర్మన్ కూడా ఉండనున్నారు. వీరితో పాటుగా ఆ ప్రాంతానికే చెందిన ఒక ఎంపినితో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు కనీసంగా ఈ బోర్డులో ఉండనున్నారు.

మిగిలిన నలుగురు సభ్యులను రాష్ట్రప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి ఈ బోర్డుకు పూర్తి స్థాయి సెక్రటరీ గా వ్యవహరించనున్నారు. 

ప్రతి జోన్ లో ఎవే కార్యాలయాలు ఉండనున్నాయి అనేది, ఏ శాఖలను ఏర్పాటు చేయాలనేది రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తుంది. బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది కూడా రాష్ట్రప్రభుత్వమే నిర్ణయించనుంది.

6గురు సభ్యులతో కూడిన జి ఎన్ రావు కమిటీ కర్ణాటక మోడల్ ఆధారంగా ఈ జోనల్ పరిపాలన విధానాన్ని తీసుకొచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కూడా ఇలా మూడు రాజధానుల విషయాన్నే సమర్థించిన విషయం తెలిసిందే. 

Also read: రాజధాని రచ్చ: ఈ నెల 20న తేలనున్న అమరావతి భవితవ్యం

కార్యనిర్వాహక రాజధాని విశాఖ అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించగానే... రాష్ట్రంలో ఉవ్వెత్తున నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే, "రాజధాని" అనే పదం రాకుండా జాగ్రత్తపడ్డా జగన్ ఇలా వికేంద్రీకరణ మంత్రాన్ని జపిస్తున్నారు. మంత్రులు, అధికారులతో ఏర్పాటు చేసిన హై పవర్ కమిట కూడా ఇప్పటివరకు జరిపిన మూడు సమావేశాల్లో కూడా ఇదే వికేంద్రీకరణ గురించే చర్చించినట్టు సమాచారం. 

కాబినెట్ ఆమోదం పొందేకంటే ముందు సంక్రాంతి పండగ అనంతరం 17 వ తారీఖునాడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఈ హై పవర్ కమిటి కలిసి దీనిపై పూర్తి స్థాయిని చర్చలు జరపనుంది. ఈ భేటీ అయిపోగానే 20వ తారీఖునాడు దీన్ని ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.  

click me!