కాకినాడకు పవన్: ద్వారంపూడి ఇంటి వద్ద హైటెన్షన్

By Siva Kodati  |  First Published Jan 14, 2020, 12:16 PM IST

వైసీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడిన జనసేన కార్యకర్తల్ని పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడకు రానుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 


వైసీపీ నేతల దాడుల్లో తీవ్రంగా గాయపడిన జనసేన కార్యకర్తల్ని పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడకు రానుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ఈ క్రమంలో పోలీసులు నగరంలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తామని తెలిపారు. సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలకు అనుమతి లేదని.. ఎవరైనా హద్దుమీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం దగ్గర భద్రత పెంచడంతో పాటు బాడీ ఫేసింగ్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 

Latest Videos

Also Read:పవన్‌ను బూతులు తిట్టిన ద్వారంపూడిని ఏమీ అనరా: ముద్రగడకు టీడీపీ కౌంటర్

పవన్ కల్యాణ్‌కు ఘనస్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు, నేతలు భారీగా కాకినాడకు తరలివస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ.. కాకినాడలో ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు.

వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్ధితి అదుపు తప్పి రాళ్ల దాడి వరకు వెళ్లింది. ఈ గొడవలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలకు గాయాలవ్వడంతో పాటు పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read:ద్వారంపూడి ఎఫెక్ట్: కాకినాడకు బయలుదేరిన పవన్, కఠినమైన ఆంక్షలు

తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని పవన్ మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా కాకినాడ వస్తానని హెచ్చరించారు. దాడి చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తల్ని వదిలేసి.. తమ జనసైనికులపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. 

click me!