వైసీపి ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసం సమీపంలోనే ఉన్న నానాజీ ఇంటికి పవన్ కల్యాణ్ రానున్నారు. పవన్ కల్యాణ్ కాకినాడ పర్యటన నేపథ్యంలో పోలీసులు కఠినమైన ఆంక్షలు విధించారు.
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం నుంచి కాకినాడకు బయలుదేరారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఆయన కాకినాడుకు వస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నానికి ఆయన కాకినాడకు చేరుకుంటారు.
పవన్ కల్యాణ్ కు స్వాగతం చెప్పేందుకు పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద యెత్తున సమాయత్తమయ్యారు. దాదడులకు గురైన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా కాకినాడకు బయలుదేరారు.
undefined
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. కాకినాడలో 133వ చట్టాన్ని కూడా అమలు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కాకినాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Also Read: కాకినాడకు పవన్: ద్వారంపూడి ఇంటి వద్ద హైటెన్షన్
కాకినాడలో ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీలు లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన తర్వాత పవన్ కల్యాణ్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
నానాజీ ఇంటి వద్దనే ద్వారంపూడి నివాసం ఉంది. నానాజీ ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. దీంతో చుట్టపక్కల దుకాణాలను కూడా పోలీసులు మూయించారు.