ఏపీపై కరోనా పంజా: మొత్తం కేసులు 5,274కి చేరిక

By narsimha lodeFirst Published Jun 10, 2020, 1:25 PM IST
Highlights

 గత 24 గంటల్లో 218 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,274కి చేరుకొన్నాయి.కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఇప్పటివరకు 78 మంది మరణించారు.


అమరావతి: గత 24 గంటల్లో 218 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,274కి చేరుకొన్నాయి.కరోనాతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఇప్పటివరకు 78 మంది మరణించారు.

also read:ఏపీ సర్కార్ వినూత్న నిర్ణయం: ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్టు రిజల్ట్స్

గత 24 గంటల్లో 15384 మంది నుండి శాంపిల్స్ సేకరిస్తే 136 మందికి కరోనా సోకినట్టుగా తేలిందని ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది.రాష్ట్రంలో ఇప్పటివరకు 2475 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1573 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. 

విదేశాల నుండి వచ్చిన 188 మందికి కరోనా సోకింది. వీరిలో 170 యాక్టివ్ కేసులని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 933 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 557 యాక్టివ్ కేసులు. ఇవాళ 22 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర టాప్ లో నిలిచింది. చైనా కంటే ఎక్కువ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.వుహాన్ కంటే ముంబైలోనే ఎక్కువ కేసులు నమోదైనట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 


 

click me!