సుప్రీంలో జగన్‌కు షాక్: హైకోర్టు తీర్పుపై 'స్టే'కి నిరాకరణ

By narsimha lodeFirst Published Jun 10, 2020, 12:59 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నాడు నిరాకరించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం నాడు నిరాకరించింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

also read:ఏ అధికారంతో ఎస్ఈసీగా ఉన్నారు... నిమ్మగడ్డ రమేశ్‌పై హైకోర్టులో కో వారెంటో పిటిషన్

రెండు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగ పదవులతో ఆటలాడుకోవద్దని కూడ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.

also read:జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీరాజ్ చట్టాన్ని మారుస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు కొత్తగా ఎస్ఈసీగా కనగరాజ్ నియామకానికి సంబంధించి జారీ చేసిన జీవోలను కూడ కొట్టివేస్తూ ఈ ఏడాది మే 29వ తేదీన హైకోర్టు తీర్పును వెలువరించింది. 

కొత్తగా ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కనగరాజ్ నియామకం చెల్లదని కూడ హైకోర్టు తేల్చి చెప్పింది.ఈ తీర్పు వెలువరించిన రోజునే తాను ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరిస్తానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అయితే ఈ విషయమై ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అభ్యంతరం తెలిపారు.

ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తోందన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని కోర్టు చెప్పలేదన్నారు. హైకోర్టు తీర్పుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఏప్రిల్ 11వ తేదీన కనగరాజ్ ను నియమిస్తూ జారీ చేసిన  619 జీవోను కూడ ప్రభుత్వం రద్దు చేసింది. 
 

click me!