వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానికి గుండెపోటు వచ్చింది. అనారోగ్యానికి గురైన నానిని హుటాహుటిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిచారు. ప్రస్తుతం నాని ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం. త్వరలోనే నాని ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం, ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఆందోళన రేపింది. గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పని చేశారు.
ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాజయం తర్వాత నాని క్రియాశీలకంగా ఉండడం లేదు. గుడివాడలో కూడా నాని పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా పరిణామంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థనలు చేస్తున్నారు.
అయితే నాని ఆరోగ్యానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే నాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైద్యుల ప్రత్యేక బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.