బిల్లుపై ఎమ్మెల్యేల రాపాకకు పవన్ ఆదేశాలు: టీడీపీ ఎమ్మెల్యేల స్లోగన్స్

By telugu teamFirst Published Jan 20, 2020, 11:47 AM IST
Highlights

సీఆర్డిఎ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను శాసనసభలో వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను ఆదేశించారు. అయితే, పవన్ ఆదేశాలను రాపాక పాటిస్తారా అనేది అనుమానంగానే ఉంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను ఆదేశించారు. అయితే, వరప్రసాద్ పవన్ కల్యాణ్ ఆదేశాలను పాటించడం సందేహంగానే ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదనను పవన్ కల్యాణ్ పార్టీపరంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ రాపాక వరప్రసాద్ మాత్రం బలపరుస్తున్నారు. 

తాను మూడు రాజధానుల ప్రతిపాదనపై వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్నట్లు రాపాక వరప్రసాద్ పలు మార్లు చెప్పారు. జగన్ నిర్ణయాన్ని తాను బలపరుస్తానని తాజాగా కూడా రాపాక వరప్రసాద్ చెప్పారు. అయితే, రాపాక తన ఆదేశాలను బేఖతారు చేస్తే పవన్ కల్యాణ్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

ఇదిలావుంటే, పాలనా వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సోమవారం ఉదయం శాసనసభలో ప్రతిపాదించారు. బుగ్గన ప్రసంగం చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. 

సీర్డీఏ ఉపసంహరణ బిల్లును మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనసభలో ప్రతిపాదించారు. సీఆర్డీఎను రద్దు చేసి, మూడు ప్రాంతాల నుంచి పరిపాలన సాగించడానికి వీలుగా ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రతిపాదించింది. 

Also Read: చంద్రబాబుకు షాక్: సీఆర్డీఎ రద్దు బిల్లుపై జగన్ వ్యూహం ఖరారు

ఆ బిల్లు చట్టంగా రూపొందిన తర్వాత సచివాలయం అమరావతిలో కొనసాగుతుంది. హైకోర్టును కర్నూలులో స్థాపిస్తారు. కార్యనిర్వాహణ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుంది. ముఖ్యమంత్రికి రెండు చోట్ల క్యాంప్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. 

click me!