ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సోమవారం నాడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో జగన్ చర్చించారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం Ys Jagan ప్రధాన మంత్రి Narendra Modi తో సోమవారం నాడు భేటీ అయ్యారు.రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఏపీ సీఎం వైఎస్ జగన్ New delhiకి చేరుకొన్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు.
also read:YS Jagan Delhi Tour: ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్.. సాయంత్రం మోదీతో భేటీ..
మరో వైపు andhra pradesh లో గత వారంలో bjp జనాగ్రహ సభను నిర్వహించింది. ఈ సభలో బెయిల్ పై ఉన్న నేతలంతా త్వరలోనే జైలుకు వెళ్తారని బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వైసీపీ తీరుపై కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఈ వ్యాఖ్యల తర్వాత మోడీతో జగన్ భేటీ అయ్యారు.
రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరనున్నారు సీఎం జగన్. Bihar కి Special Status పరిశీలన లో ఉందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్. ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ శాసన సభలో చేసిన తీర్మానాన్ని ప్రధానికి సీఎం జగన్ అందించనున్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వరద సాయంలో జరిగిన అన్యాయాన్ని కూడా ప్రధానికి వివరించనున్నారు సీఎం. వరదల సమయంలో తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని ప్రధానికి గతంలో సీఎం లేఖ రాసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు, విభజన హామీలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు సీఎం జగన్.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రధానిని కోరనున్నారు సీఎం జగన్.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కోరే అవకాశం ఉంది.
మరో వైపు Telangana డిస్కంల నుండి andhra pradesh కి రావాల్సిన విద్యుత్ బకాయిల విషయమై కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోడీతో చర్చించే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలని తక్షణం పరిష్కరించాలని సీఎం జగన్ కోరనున్నారు..రాష్ట్ర సమగ్రాభివృద్ధికి త్వరలో మరోమారు Three capitals బిల్లులు తీసుకువచ్చే అంశం పై ప్రధాని దృష్టికి జగన్ తీసుకెళ్లనున్నారు.
అంతేకాదు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టులపై ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవలనే లేఖ రాసింది.రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై కూడా ప్రధానంగా ప్రధానితో చర్చించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. విజభన హామీలను అమలు చేయాలని కూడా జగన్ ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటినా కూడా ఇంకా విభజన హామీలు పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని కూడా సీఎం జగన్ ప్రధాని దృష్టికి వచ్చే అవకాశం ఉంది.